Home /News /movies /

NAGA CHAITANYA READY FOR SECOND MARRIAGE NEWS GO VIRAL IN SOCIAL MEDIA SB

సమంతకు షాక్.. నాగచైతన్య రెండో పెళ్లికి సిద్దమయ్యాడా?

నాగ చైతన్యకు మరో పెళ్లి? షాక్‌లో సమంత ?

నాగ చైతన్యకు మరో పెళ్లి? షాక్‌లో సమంత ?

సమంతతో విడాకులు తర్వాత చైతన్యకు పెళ్లి చేయాలని నాగార్జున భావిస్తున్నారట. అందుకే త్వరలోనే చైతుకు పెళ్లి చేసేందుకు సిద్దమవుతున్నారు.

    నాగచైతన్య సమంత( Naga chaitanya Samantha) .. వీరిద్దరికి సంబంధించిన ఏ వార్త అయిన సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటుంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా ఈ జంటకు ఫాలోవర్స్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు విడాకులు తర్వాత వీరికి సంబంధించిన ఏ వార్త అయిన ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది. విడాకులు తర్వాత సమంత(Samantha), నాగచైతన్య (Naga Chaitanya)ఏం చేసిన కూడా అభిమానులు.. మరింత ఆసక్తిగా తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు నాగచైతన్యకు సంబంధించి మరో వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న చై, సామ్‌లు గతేడాది తమ వివాహ బంధానికి పుల్ స్టాప్ పెట్టేశారు. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన సమంత,నాగచైతన్య విడాకులు (naga chaitanya samantha divorce) తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరిపై ఎన్నో రూమర్స్ వచ్చాయి.

    నాగచైతన్య కన్నా ఎక్కువగా సమంత మీద రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే ప్రస్తుతం చైతుకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ రూమర్ ఒకటి చక్కర్లో కొడుతుంది. ఇటు సినీ ఇండస్ట్రీలో అటు సోషల్ మీడియాలో ఈ రూమర్ తెగ వైరల్ అవుతోంది. ఇంతకు విషయం ఏంటంటే.. త్వరలో నాగచైతన్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గత కొన్ని రోజుల నుంచి చిన్నకొడుకుఅఖిల్ కోసం మంచి సంబంధాల కోసం వెతుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగచైతన్యకు(Naga Chaitanya Second Marriage) కూడా వివాహం చేయాలని నాగార్జున భావిస్తున్నారట. నాగ చైతన్యకి, అఖిల్ కి ఒకేసారి వివాహం చేద్దామనుకుంటున్న నాగార్జునకు అది కుదరలేదు.

    అయితే ఇప్పుడు సమంతతో విడిపోయిన నాగ చైతన్య(Naga Chaitanya) ఓ స్టార్ హీరోయిన్ తో లవ్ లో ఉన్నట్లు సమాచారం. అందువల్ల కింగ్ నాగార్జున ఈ ఇద్దరికీ ఒకేసారి వివాహం చేద్దామని నిర్ణయించుకున్నారట. అయితే ఈ విషయంపై ఇంతవరకు సమంత(Samantha) కూడా ఎక్కడ ఎలాంటి కామెంట్లు కాని పోస్టులు కాని చేయలేదు. దీంతో ఈ వార్తలో నిజమెంతో అని టాలీవుడ్‌లో జోరుగా చర్చ నడుప్తోంది. మరి ఇది నిజమా లేకుంటే ఒట్టి రూమరేనా తెలుసుకోవాలంటే.. ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. నాగచైతన్య,సాయిపల్లవి ఇటీవలే చేసిన లవ్ స్టోరి(Love Story) సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే.దానికన్నా ముందు చైతు.. తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమా కూడా చేశాడు.ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Naga Chaitanya, Naga Chaitanya Akkineni, Naga Chaitanya Samantha Divorce, Samantha Ruth Prabhu

    తదుపరి వార్తలు