NAGA CHAITANYA RANA DAGGUBATI WILL ACT SHIMBU MAANADU REMAKE HERE ARE THE DETAILS TA
Naga Chaitanya - Rana : ఆ సూపర్ హిట్ రీమేక్‌లో నాగ చైతన్య, రానాల మల్టీస్టారర్..? త్వరలో అఫీషియల్ ప్రకటన..
రానా దగ్గుబాటి, నాగ చైతన్య (File/Photo)
Naga Chaitanya Akkineni- Rana Daggubati : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ మల్టీస్టారర్స్ ఎక్కువయ్యాయి. తాజాగా రియల్ లైఫ్ బావ బామ్మర్థులైన రానా, నాగ చైతన్యలు ఓ సూపర్ హిట్ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి
Naga Chaitanya Akkineni- Rana Daggubati : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ మల్టీస్టారర్స్ ఎక్కువయ్యాయి. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు స్క్రీన్ పై సందడి చేస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున, నాగ చైతన్యలు కలిసి ‘బంగార్రాజు’ మూవీలో స్క్రీన్ పై కలిసి సందడి చేశారు. అటు చిరంజీవి, రామ్ చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ మూవీలో పూర్తి స్థాయిలో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక నాగ చైతన్య .. బంగార్రాజు కంటే ముందు ‘మనం’ సినిమాలో నాన్న నాగార్జునతో పాటు తాత నాగేశ్వరరావుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు ప్రేమమ్‌లో కూడా తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేష్‌తో కలిసి నటించారు. అటు వెంకీ మామలో తన మేనమామ వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు నాగార్జున.
తాజాగా ఈ కోవలో నాగ చైతన్యతో తన బావ రానా దగ్గుబాటితో కలిసి ఓ సూపర్ హిట్ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రీసెంట్గా తమిళంలో శింబు, ఎస్.జే.సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘మానాడు’ సినిమాను తెలుగు రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఇపుడీ రీమేక్‌లో శింబు పాత్రలో నాగ చైతన్య, ఎస్.జే. సూర్య పాత్రలో రానా దగ్గుబాటి నటించే అవకాశం ఉంది.
ఈ సినిమా తెలుగు రీమేక్‌ను ప్రముఖ దర్శకుడు తెరకెక్కించే అవకాశాలున్నాయి. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఇక నాగ చైతన్య విషయానికొస్తే.. రీసెంట్గా తన తండ్రి నాగార్జునతో చేసిన ‘బంగార్రాజు’తో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతేకాదు ఈ యేడాది మన దేశంలోనే మొదటి బ్లాక్ బస్టర్‌గా ఈ సినిమా నిలిచింది. నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘థాంక్యూ’ పేరుతో వస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
రానా దగ్గుబాటి, నాగ చైతన్య (File/Photo)
ఇక అది అలా ఉంటే నాగ చైతన్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. మొత్తం 24-30 ఎపిసోడ్లతో 3 సీజన్లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.
రానా విషయానికొస్తే.. ఈ యేడాది ‘1945’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా విడుదలైన విషయం ఎవరికీ తెలియదు. మరోవైపు రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్స్ బ్యాగ్రౌండ్లో చేసిన చిత్రం విరాటపర్వం .వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుద ల చేయాలనీ అనుకున్నారని టాక్ వచ్చింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ నెట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ముప్పై ఐదు కోట్లకు పైగా ఆఫర్ చేసింది. ఐతే.. ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుంది. ఈ సినిమాలో రానా రవన్న అనే కామ్రేడ్ పాత్రలో కనిపించనున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. మరోవైపు ఈయన పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమా చేసారు. ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదల కానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.