హోమ్ /వార్తలు /సినిమా /

Thank You Twitter Review : నాగ చైతన్య థాంక్యూ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Thank You Twitter Review : నాగ చైతన్య థాంక్యూ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Thank you Twitter Review Photo : Twitter

Thank you Twitter Review Photo : Twitter

Naga Chaitanya | Thank You Twitter Review : నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ థాంక్యూ. టీజర్స్ అండ్ ట్రైలర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ఇప్పటికే ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను చెబుతున్నారు.. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...

నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ థాంక్యూ. టీజర్స్ అండ్ ట్రైలర్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా జూలై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా (Raashi Khanna) హీరోయిన్‌గా చేశారు. ఇతర ముఖ్య పాత్రల్లో మాళవిక నాయర్, అవికా గోర్ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించగా.. దిల్ రాజు నిర్మించారు. అది అలా ఉంటే ఈ సినిమాకు పలుచోట్ల అప్పుడే ప్రీమియర్స్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా (Thank You Twitter Review)  తెలుపుతున్నారు... అసలు కథేంటీ, కథనం ఎలా ఉంది.. తెలుగు వారిని ఏ మాత్రం ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. థాంక్యూ మూవీ నైజాం ఏరియాలో 8కోట్లకు బిజినెస్ చేయగా.. సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్ర - 9.5 కోట్లు చేసింది. మొత్తంగా ఏపీ, తెలంగాణాలలో ఇరవై కోట్లు అవ్వగా.. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాకు కోటిన్నర, ఓవర్సీస్‌లో రెండున్నర కోట్లు వరకు చేసింది. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్‌గా థాంక్యూ మూవీ 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే 25 కోట్లు వసూలు చేయాలి. చూడాలి మరి ఎంత మాత్రం కలెక్ట్ చేస్తుందో..

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మూడు వేరియేషన్స్ లో ఒక యువకుడి లైఫ్ లోని జరిగిన ఎమోషనల్ జర్నీ కథాంశంగా తీసుకున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇక పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు.


ఇక నాగ చైతన్య గత సినిమాల విషయానికి వస్తే.. నాగ చైతన్య (Naga Chaitanya) గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా తన తండ్రి నాగార్జునతో కలిసి ఈయన చేసిన  సినిమా బంగార్రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ’మజిలీ’ తర్వాత ’లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో కెరీర్‌లో ఫస్ట్ హాట్రిక్ అందుకున్నాడు. అంతకు ముందు ’వెంకీ మామ’ సినిమా కూడా సక్సెస్ అయింది.

ఇక మరో వైపు నాగ చైతన్య సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌‌లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.  ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌‌ను ఖరారు చేసారు. మరోవైపు  ఇక చైతన్య హిందీలో తొలిసారి ‘లాల్ సింగ్ చద్ధా’లో నటించారు.  ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 11న విడుదల చేస్తున్నారు.

ఇక తాజాగా చైతన్య తమిళ దర్శకుడి వెంకట్ ప్రభుతో తన 22వ చిత్రాన్ని మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో మరోసారి చైతన్యతో కృతి శెట్టి నటించనుంది. ఆమె గతంలో బంగార్రాజులో నటించిన సంగతి తెలిసిందే. వీటితో పాటు అటు ఆమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో ఒకేసారి హిందీ, తెలుగు పాటు మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో  ఈ సినిమాకు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరు తన కెరీర్‌లో ‘రుద్రవీణ’, త్రినేత్రుడు’ సినిమాల తర్వాత సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న మూడో  చిత్రం ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ కావడం విశేషం. తాజాగా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్రకు సంబంధించిన లుక్‌‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య ‘బాలరాజు’ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ దక్షిణాదికి చెందిన యువకుడి పాత్రలో కనిపించనున్నారు. పైగా తన తాత అక్కినేని నాగేశ్వరరావుకు స్టార్‌డమ్ తీసుకొచ్చిన ‘బాలరాజు’ పాత్రలో ‘లాల్ సింగ్ చడ్దా’ లో కనిపించడం విశేషం.

First published:

Tags: Avika gor, Naga Chaitanya, Raashi Khanna, Tollywood news