హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya - Parasuram : నాగ చైతన్య, పరశురామ్ సినిమాకు ఎవరు ఊహించని క్రేజీ టైటిల్..

Naga Chaitanya - Parasuram : నాగ చైతన్య, పరశురామ్ సినిమాకు ఎవరు ఊహించని క్రేజీ టైటిల్..

నాగ చైతన్య,పరశురామ్ చిత్రానికి క్రేజీ టైటిల్ (Twitter/Photo)

నాగ చైతన్య,పరశురామ్ చిత్రానికి క్రేజీ టైటిల్ (Twitter/Photo)

Naga Chaitanya - Parasuram : నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దాంటో పాటు వెబ్ సిరీస్‌ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈయన సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఓ క్రేజీ టైటిల్‌ను అనుకుంటున్నారట.

ఇంకా చదవండి ...

Naga Chaitanya - Parasuram  :  ఏ సినిమా కైనా టైటిలే ఇంపార్టెంట్. పేరును బట్టి అది ఎటువంటి సినిమా అనే విషయమై ఆడియన్స్ కూడా ఒక అంచనాకు వస్తారు. తాజాగా పరశురామ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)తో తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’(Sarkaru Vaari Paata) టైటిల్‌తోనే ఈ మూవీపై అటెన్షన్ క్రియేట్ చేశారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత పరశురామ్.. ఇపుడు నాగ చైతన్యతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇదే అంటూ ఓ క్రేజీ టైటిల్ నెటింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘నాగేశ్వరరావు’ (Nageswara Rao) అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. తాత నాగేశ్వరరావు టైటిల్ పెడితే.. ఈ సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశాలున్నాయి. ఇక చైతూ, పరశురామ్ మూవీ.. గీతా గోవిందం తర్వాత సెట్స్ పైకి వెళ్లాల్సింది.కానీ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ మూవీ కారణంగా ఆలస్యమైంది. ఇక నాగ చైతన్య, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో  తెరకెక్కనుంది.

నాగ చైతన్య విషయానికొస్తే..  గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా తన తండ్రి నాగార్జునతో కలిసి ఈయన చేసిన  సినిమా బంగార్రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ’మజిలీ’ తర్వాత ’లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో కెరీర్‌లో ఫస్ట్ హాట్రిక్ అందుకున్నాడు.అంతకు ముందు ’వెంకీ మామ’ సినిమా కూడా సక్సెస్ అయింది. అది కలుపుకుంటే వరుసగా నాలుగు హిట్స్ అందుకున్నట్టు లెక్క.  ఇక అది అలా ఉంటే నాగ చైతన్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ‘థాంక్యూ’ తో పాటు   ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు.  దాంతో పాటు నాగ చైతన్య చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి.

Nagarjuna - Annamayya: నాగార్జున ‘అన్నమయ్య’లో శ్రీ వేంకటేశ్వర స్వామిగా ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌‌లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌‌ను ఖరారు చేసారు. నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘థాంక్యూ’ పేరుతో వస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకొంచెం ప్యాచ్ వర్క్ మిగిలిఉంది.  త్వరలోనే  ఈ సినిమా విడుదల తేదినీ ప్రకటించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు సాయంత్రం 5 గంటలకు 4 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

విక్రమ్ కుమార్‌లో నాగ చైతన్య (Twitter/Photo)

‘థాంక్యూ’ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తున్నారు. ఇతర కీలకపాత్రల్లో అవికా గోర్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.  మరోవైపు  ఇక చైతన్య హిందీలో తొలిసారి ‘లాల్ సింగ్ చద్ధా’లో నటించారు.  ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 11న విడుదల చేస్తున్నారు.

Chiranjeevi - Balakrishna - Jr NTR - Ram Charan : చిరంజీవి టూ బాలకృష్ణ.. ఎన్టీఆర్ టూ రామ్ చరణ్ కొత్త కొత్తగా ట్రై చేస్తోన్న హీరోలు..

తాజాగా తమిళ దర్శకుడి వెంకట్ ప్రభుతో నాగ చైతన్య 22వ చిత్రం.. అధికారిక ప్రకటన చేశారు. దాంతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం.  మరోవైపు  నాగ చైతన్యతో తన బావ  రానా దగ్గుబాటితో కలిసి ఓ సూపర్ హిట్ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రీసెంట్‌గా తమిళంలో శింబు, ఎస్.జే.సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘మానాడు’ సినిమాను తెలుగు రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఇపుడీ రీమేక్‌లో శింబు పాత్రలో నాగ చైతన్య, ఎస్.జే. సూర్య పాత్రలో రానా దగ్గుబాటి నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

First published:

Tags: Naga Chaitanya Akkineni, ParasuRam, Tollywood

ఉత్తమ కథలు