‘అదే నువ్వు అదే నేను’ టైటిల్‌తో నాగ చైతన్య, రష్మిక కొత్త మూవీ..

గత  కొన్నేళ్లుగా హిట్టు కోసం ముఖం వాచిపోయినా నాగ చైతన్యకు ఈ యేడాది తన భార్య సమంతతో చేసిన ‘మజిలీ’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. తాజాగా నాగ చైతన్య, రష్మిక జోడిగా మరో సినిమాకు ఓకే చెప్పాడు.

news18-telugu
Updated: September 13, 2019, 8:25 AM IST
‘అదే నువ్వు అదే నేను’ టైటిల్‌తో నాగ చైతన్య, రష్మిక కొత్త మూవీ..
నాగ చైతన్య, రష్మిల ‘అదే నువ్వు అదే నేను’ (Twitter/Photo)
  • Share this:
గత  కొన్నేళ్లుగా హిట్టు కోసం ముఖం వాచిపోయినా నాగ చైతన్యకు ఈ యేడాది తన భార్య సమంతతో చేసిన ‘మజిలీ’ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా తర్వాత చైతూ.. తన మేనమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు రీసెంట్‌గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రౌడీ బేబి సాయి పల్లవితో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య హిందీలో హిట్టైన ‘బదాయి హో’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.తాజాగా నాగ చైతన్య ..దిల్ రాజు నిర్మాణంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా కొత్త చిత్రానికి ఓకే చేసినట్టు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ జెమిని చానెల్ అఫీషియల్‌గా ట్విట్టర్‌లో ప్రకటించింది.


ఈ సినిమాకు ‘అదే నువ్వు అదే నేను’ అనే టైటిల్‌ కూడా ఖరారు చేసారు.  ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నట్టు సమాచారం. ఇలా సినిమా మేకర్స్ కాకుండా.. శాటిలైట్ హక్కులు దక్కించుకున్న ఒక టెలివిజన్ ఈ ప్రాజెక్ట్ విషయం అనౌన్స్ చేయడం ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ ఎపుడు మొదలు పెడతారు వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాగ చైతన్య చేతిలో ఉన్న సినిమాలు కంప్లీటైన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మరోవైపు రష్మిక తెలుగులో సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు చేస్తోంది.
First published: September 13, 2019, 8:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading