విజయ్ దేవరకొండ దర్శకుడితో నాగ చైతన్య కొత్త సినిమా..

ప్రస్తుతం అక్కినేని హీరోలందరూ ఫ్లాపుల్లో ఉన్నారు. వీళ్లందరికి అర్జంటుగా ఒక్క హిట్టు కావాలి. అందులో అక్కినేని పెద్దోడు నాగచైతన్య గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.ఈ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండకు ‘గీతా గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్‌తో నెక్ట్స్ మీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 20, 2019, 8:06 AM IST
విజయ్ దేవరకొండ దర్శకుడితో నాగ చైతన్య కొత్త సినిమా..
విజయ్ దేవరకొండ, నాగ చైతన్య
  • Share this:
ప్రస్తుతం అక్కినేని హీరోలందరూ ఫ్లాపుల్లో ఉన్నారు. వీళ్లందరికి అర్జంటుగా ఒక్క హిట్టు కావాలి. అందులో అక్కినేని పెద్దోడు నాగచైతన్య గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.  ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తర్వాత చైతూకు ఒక్క సక్సెస్ లేదు. ఆ తర్వాత చేసిన ‘యుద్దం శరణం’, ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘సవ్యసాచి’ సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి ఫ్లాప్‌గా నిలిచాయి.

ప్రస్తుతం నాగ చైతన్య..తన రియల్ లైఫ్ భాగస్వామి అయిన సమంతతో కలిసి ‘మజిలి’ సినిమా  చేస్తన్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు మేనమామ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాలతో పాటు విజయ్ దేవరకొండకు ‘గీతా గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన పరశురామ్‌తో నెక్ట్స్ మీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తైయినట్టు సమాచారం. ఈ సినిమాను గీతాఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించే అవకాశాలున్నాయి. గతంలో చైతూతో అల్లు అరవింద్ 100% లవ్ సినిమాను తెరకెక్కించాడు. ఇపుడు మరోసారి అల్లు అరవింద్ నిర్మాణంలో నాగచైతన్య ఈ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కేబోయే ఈ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టేనర్‌ అని చెబుతున్నారు. మరి ఈ సినిమాతోనైనా నాగ చైతన్య హీరోగా కోరకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

శృతి హాసన్ ఫోటోస్ 
ఇవి కూడా చదవండి 

బోయపాటి శ్రీను ఇంకా మారలేదు.. మరి బాలకృష్ణ ఏం చేస్తాడో..బాహుబలికి RRR ఏమాత్రం తీసిపోదు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

ఎన్టీఆర్ బయోపిక్ పై వర్మ సంచలనం.. భజన చేస్తే బయోపిక్ చూడరు..
First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు