హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya | Bangarraju : బంగార్రాజు నుంచి మాస్ పాట వాసివాడి తస్సాదియ్యా విడుదల..

Naga Chaitanya | Bangarraju : బంగార్రాజు నుంచి మాస్ పాట వాసివాడి తస్సాదియ్యా విడుదల..

Bangarraju Photo : Twitter

Bangarraju Photo : Twitter

Naga Chaitanya | Bangarraju : ఈ చిత్రం నుండి మరో మాస్ సాంగ్ వాసివాడి తస్సాదియ్యా లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటను కళ్యాణ కృష్ణ కురసాల రాయగా.. మోహన బోగరాజు, సాహితి పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

ఇంకా చదవండి ...

Naga Chaitanya | Bangarraju : నాగ చైతన్య, నాగార్జునలు కలిసి  ‘బంగార్రాజు’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి నాగార్జున (Nagarjuna) లెవల్లో నటించి ఔరా అనిపించారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి మరో సాంగ్‌‌ లిరికల్ విడుదల‌ైంది. వాసివాడి తస్సాదియ్యా అంటూ సాగే ఈ పాట మాస్‌కు ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. నిన్న టీజర్‌ను విడుదల చేయగా.. పూర్తి పాటను డిసెంబర్ 19న విడుదల చేశారు. ఈ పాటను కళ్యాణ కృష్ణ కురసాల రాయగా.. మోహన బోగరాజు, సాహితి పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

ఇక ఆ మధ్య ‘నా కోసం’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట మెలోడియ‌స్‌గా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఈ పాటను బాలాజీ రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైత‌న్య (Naga Chaitanya) స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) న‌టిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుందని తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో  రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జవనరి 7న ముందుగా సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో రంగంలోకి దిగుతోంది. దాంతో పాటు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’, జనవరి 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంత గట్టి పోటీలో కూడా నాగార్జున, నాగా చైతన్య ... నేనున్నంటూ బంగార్రాజు మూవీతో బరిలో దిగబోతున్నారు.

WWW Movie : సోనిలివ్‌లో శివానీ రాజశేఖర్ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు.. డిసెంబర్ 24న స్ట్రీమింగ్..

ఇక నాగ చైతన్య నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన బంగార్రాజుతో పాటు ‘థాంక్యూ’ మూవీలో నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హార్రర్ జానర్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)

First published:

Tags: Akkineni nagarjuna, Bangarraju, Kriti shetty, Tollywood news

ఉత్తమ కథలు