Naga Chaitanya | Bangarraju : నాగ చైతన్య, నాగార్జునలు కలిసి ‘బంగార్రాజు’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి నాగార్జున (Nagarjuna) లెవల్లో నటించి ఔరా అనిపించారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై ఇంత వరకు క్లారిటీ లేదు. సంక్రాంతి విడుదల అని అంటున్నారు కానీ ఇప్పటివరకు ప్రకటించలేదు. అంతేకాదు ప్రమోషన్స్‌లో వెనుకబడి ఉంది. దీంతో అసలు బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా.. లేదా అనే క్లారిటీ లేక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫూజన్లో ఉన్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉందని టాక్. దీనికి సంబంధించి అతి త్వరలో ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో వెండితెరపైకి రానుంది. మరో రెండు రోజుల్లో బంగార్రాజుకు సంబంధించిన మేజర్ అప్డేట్ను విడుదల చేయబోతున్నారట నాగార్జున. బంగార్రాజు జనవరి 15న వెండితెరపైకి రానున్నట్లు నాగార్జున అధికారికంగా ప్రకటించనున్నారట.
ఇక సంక్రాంతికి వస్తామని ప్రకటించిన పలు సినిమాలు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం పోస్ట్ పోన్ కాగా, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫిబ్రవరికి వాయిదా పడింది.
Last day of the shoot!!
Another peppy dance number loading.!!
పండగ లాంటి సినిమా!!
?బంగార్రాజు coming soon?#Bangarraju#BangarrajuComing@chay_akkineni@kalyankrishna_k @iamkrithishetty@anuprubens@AnnapurnaStdios @ZeeStudios_ pic.twitter.com/zq1R2pHjKM
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 23, 2021
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ జనవరి 7 వ తేదీన విడుదల కానుండగా.. ప్రభాస్ రాధే శ్యామ్ 14 వ తేదీన విడుదల కానుంది. ఇక ఇదే రేసులో ఉన్న అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బంగార్రాజు చిత్రం విడుదల పై ఇంకా క్లారిటీ లేదు.. సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం జనవరి 15 వ తేదీన విడుదల కావలసి ఉంది. దీనిపై టీమ్ త్వరలో ప్రకటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్ లిరికల్ విడుదలైంది. వాసివాడి తస్సాదియ్యా అంటూ సాగే ఈ పాట మాస్కు ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. నిన్న టీజర్‌ను విడుదల చేయగా.. పూర్తి పాటను డిసెంబర్ 19న విడుదల చేశారు. ఈ పాటను కళ్యాణ కృష్ణ కురసాల రాయగా.. మోహన బోగరాజు, సాహితి పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఆ మధ్య ‘నా కోసం’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట మెలోడియస్గా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఈ పాటను బాలాజీ రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
RRR Pre release event : కేరళలో ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్.. గెస్ట్‌గా మిన్నల్ మురళి హీరో..
ఇక నాగ చైతన్య నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన బంగార్రాజుతో పాటు ‘థాంక్యూ’ మూవీలో నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హార్రర్ జానర్లో వస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kriti shetty, Naga Chaitanya, Nagarjuna Akkineni, Tollywood news