Home /News /movies /

Naga Chaitanya | Bangarraju : బంగార్రాజు నుంచి మధురమైన పాట.. అదరగొట్టిన సిద్ శ్రీరామ్..

Naga Chaitanya | Bangarraju : బంగార్రాజు నుంచి మధురమైన పాట.. అదరగొట్టిన సిద్ శ్రీరామ్..

Bangarraju Photo : Twitter

Bangarraju Photo : Twitter

Naga Chaitanya | Bangarraju : ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట మెలోడియ‌స్‌గా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఈ పాటను బాలాజీ రాయగా సిద్ శ్రీరామ్ పాడారు.

    Naga Chaitanya | Bangarraju : నాగ చైతన్య, నాగార్జునలు కలిసి  ‘బంగార్రాజు’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి నాగార్జున (Nagarjuna) లెవల్లో నటించి ఔరా అనిపించారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట మెలోడియ‌స్‌గా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఈ పాటను బాలాజీ రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

    అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైత‌న్య (Naga Chaitanya) స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) న‌టిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


    ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుందని తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో  రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జవనరి 7న ముందుగా సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో రంగంలోకి దిగుతోంది. దాంతో పాటు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’, జనవరి 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంత గట్టి పోటీలో కూడా నాగార్జున, నాగా చైతన్య ... నేనున్నంటూ బంగార్రాజు మూవీతో బరిలో దిగబోతున్నారు.

    Balakrishna | Akhanda : భారీ ధరకు అమ్ముడైన అఖండ హిందీ రైట్స్.. బాలయ్య క్రేజ్ అలాంటిది..

    ఇక నాగ చైతన్య నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన బంగార్రాజుతో పాటు ‘థాంక్యూ’ మూవీలో నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హార్రర్ జానర్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Kriti shetty, Naga Chaitanya, Nagarjuna Akkineni, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు