Home /News /movies /

NAGA CHAITANYA MAARO MAARO LYRICAL SONG RELEASE THANK YOU SB

Naga Chaitanya: సై అంటే సై అంటోన్న నాగ చైతన్య.. థాంక్యూ నుంచి మరో పాట రిలీజ్!

థాంక్యూ నుంచి మారో మారో సాంగ్ విడుదల

థాంక్యూ నుంచి మారో మారో సాంగ్ విడుదల

థాంక్యూ సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నట్లు సమాచారం. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను జులై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

    అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), రాశీ ఖన్నా (Raasi Khanna) జంటగా నటిస్తున్న సినిమా థాంక్యూ. లవ్ స్టోరీ(Love Story), బంగార్రాజు(Bangarraju) సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన చైతు థాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విక్రమ్ కె కుమార్(Vikram K Kumar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశీ ఖన్నాతో పాటు మాళవిక నాయర్,అవికాగోర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులుజరుపుకుంటున్న థాంక్యూ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్లు రిలీజ్, టీజర్ విడుదల అయ్యాయి.

    వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు (Dil Raju) నిర్మాతగా వ్యవహరిస్తున్న థాంక్యూ సినిమాలో నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్లో కనిపించనున్నట్లు సమాచారం. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను జులై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మారో మారో..’ అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.



    సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) స్వరాలు అందించిన ఈ పాటను దీపు అండ్ ప్రదీప్ చంద్ర ఆలపించారు. ఈ క్యాచీ పాటకు విశ్వ అండ్ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం సమకూర్చారు. లెజండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథను అందించారు. ఈ సినిమాను జూలై 8న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.



    మరోవైపు నాగచైతన్య  దర్శకుడు పరశురామ్(Parusaram)తో కలిసి కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈమధ్యనే మహేష్ బాబు హీరోగా నటించిన "సర్కారు వారి పాట" సినిమా తో మర్చిపోలేని బ్లాక్బస్టర్ ని అందుకున్నారు డైరెక్టర్ పరశురామ్. ఇక ప్రస్తుతం అభిమానులు అందరూ పరశురాం తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పరశురాం ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య తో ఒక సినిమా చేయబోతున్నారని వార్త  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Dil raju, Naga Chaitanya, Naga Chaitanya Akkineni, Raashi Khanna

    తదుపరి వార్తలు