థాంక్యూ మూవీ తర్వాత అక్కినేని వారసుడు నాగ చైతన్య (Naga Chaitanya) చేస్తున్న కొత్త సినిమా కస్టడీ (Custody). వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. నాగచైతన్య కెరీర్ లో 22వ మూవీగా ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సినిమా షూటింగ్ ఫినిష్ చేసి అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చారు మేకర్స్.
ఫైనల్ షాట్ ఫినిష్ చేస్తున్న సన్నివేశాలతో కూడిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు నాగ చైతన్య. ఈ వీడియోలో దర్శకుడు వెంకట్ ప్రభు ఫైనల్ షాట్ కి కట్ చెబుతూ.. చై ఇక నువ్వు కస్టడీ నుంచి రిలీజ్ అని అంటూ కనిపించారు. మే 12న థియేటర్లలో కలుద్దామని నాగ చైనత్య, కృతి శెట్టి చెబుతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ కస్టడీ మూవీ షూటింగ్ చేస్తూనే ప్రీ లుక్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు వదలగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. టాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నారు. నాగ చైతన్య గత సినిమాలకు బిన్నంగా ఈ సినిమా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.
It’s a wrap for #Custody such a great time shooting with this amazing team @vp_offl @thearvindswami @iamkrithishetty @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar #Priyamani #SampathRaj @SS_Screens #CustodyOnMay12 pic.twitter.com/nB3Il1UPoE
— chaitanya akkineni (@chay_akkineni) February 24, 2023
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్‌గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు నాగ చైతన్య. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫమ్ చేసారు. ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.