హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya: బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన నాగ చైతన్య..

Naga Chaitanya: బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన నాగ చైతన్య..

నాగ చైతన్య (File/Photo)

నాగ చైతన్య (File/Photo)

Naga Chaitanya Bollywood Debut | బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన నాగ చైతన్య.. వివరాల్లోకి వెళితే..

    Naga Chaitanya Bollywood Debut | బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన నాగ చైతన్య.. వివరాల్లోకి వెళితే.. అక్కినేని  నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కోవిడ్ కారణంగా ఈ సినిమాను వాయిదా వేసారు. ప్రభుత్వం థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చేసింది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. తెలంగాణ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పాపులర్ అయ్యాయి.  మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశీఖన్నాతో అవికా గోర్, మాళవిక నాయర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మరోవైపు నాగ చైతన్య ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాలో నటిస్తున్నారు.

    ఈ సినిమా షూటింగ్‌లో నాగ చైతన్య ఎపుడో జాయిన్ కావాల్సింది. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో నాగ చైతన్య జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్‌‌ను లద్దాఖ్‌లో నాగ చైతన్య పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన ఓ యువకుడి పాత్ర ఉందట. కథను కీలక మలుపు తిప్పే అతికీలకమైన ఆ క్యారెక్టర్ ఇది. ఆమీర్ ఖాన్ నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ విషయానికొస్తే.. ఈ సినిమాను హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    Naga Chaitanya Bollywood Debut | బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన నాగ చైతన్య.. వివరాల్లోకి వెళితే..
    ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌లో జాయిన్ అయిన నాగ చైతన్య (Instagram/Photo)

    ఇక నాగ చైతన్య సతీమణి.. సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇక  చైతూ తండ్రి నాగార్జున కూడా  పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఇపుడు ’బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు. ఇపుడు తండ్రి నాగ్ బాటలోనే నాగ చైతన్య కూడా ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్ట్‌గా పలకరించనున్నారు. ఇక చైతూ తన డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. మొత్తంగా నాన్న నాగార్జున, భార్య సమంత బాటలో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aamir Khan, Bollywood news, Laal Singh Chaddha, Naga Chaitanya Akkineni, Tollywood

    ఉత్తమ కథలు