స్యామ్ జామ్ షో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రెండు నెలల కింద మొదలైన ఈ షో తొలి సీజన్ పూర్తి కానుంది. ఇప్పటికే 7 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. అందులో విజయ్ దేవరకొండ నుంచి చిరంజీవి, అల్లు అర్జున్ వరకు చాలా మంది గెస్టులు వచ్చారు. ఇక చివరి ఎపిసోడ్ కోసం నాగ చైతన్య వచ్చాడు. టాలీవుడ్ క్రేజీ కపుల్స్‌లో చైస్యామ్ కూడా ఉంటారు. తాజాగా స్యామ్ జామ్ షోకు వచ్చిన చైతూ చాలా రచ్చ చేసాడు. సైలెంట్‌గా కనిపిస్తుంటాడు కానీ లోపల మాత్రం చాలా అల్లరి పిల్లోడే ఉన్నాడు. ముఖ్యంగా సమంతతో అయితే ఆడుకున్నాడు నాగ చైతన్య. ఈ షోకు అందరికంటే చివర్లో వచ్చాడు చైతూ. దీనిపై సెటైర్లు వేసాడు చైతూ. వీడు ఇంట్లోనే పడుంటాడు కదా.. ఎప్పుడు పిలిచినా వస్తాడులే అనుకుని చివర్లో నన్ను పిలిచావ్ అంటూ భార్యపై సెటైర్ వేసాడు. దానికి సమంత షాక్ అయిపోయి నవ్వేసింది. ఆ తర్వాత కూడా భార్యను వదల్లేదు చైతూ. దొరికిందే ఛాన్స్ అనుకుంటూ వరస సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. ఒకేసారి చాలా మంది అమ్మాయిలను ఫ్లర్ట్ చేసావా అని భర్తను అడిగింది సమంత. దానికి చైతూ నవ్వేస్తూ సమాధానమిచ్చాడు.
నువ్వెప్పుడు గుడ్ మూడ్‌లో ఉంటావ్ అంటే నేనెప్పుడూ అదే మూడ్‌లో ఉంటాను కదా అంటూ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత నాకు హోస్టుగా ఎన్ని మార్కులు వేస్తావ్ అంటే నీకు అడ్వైస్ ఇస్తే తీసుకుంటావా.. ఇంట్లోనే తీసుకోవు కదా అంటూ అసలు గుట్టు బయటపెట్టాడు చైతూ. వరసగా అలా భార్యను ఆటపట్టిస్తూనే ఉన్నాడు. మరోవైపు సమంత కూడా భర్త ఆడుకుంటుంటే అలాగే చూస్తుండిపోయింది. వంటల గురించి అడిగినపుడు కూడా సమంతను బుక్ చేసాడు చైతన్య. అసలు నువ్వెప్పుడు చేసావ్ వంట అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడు.
అక్కడితో ఆగకుండా నేను కనీసం కాలేజ్‌కు వెళ్లాను.. నువ్వు అసలు కాలేజ్ మొహమైనా చూసావా అంటూ రెచ్చిపోయాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సమంతపై వరస పంచులు వేస్తూనే ఉన్నాడు ఈయన. ఈ ప్రోమో చూస్తుంటేనే ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. పైగా ఇప్పటి వరకు వచ్చిన గెస్టులకు హోస్ట్ గురించి తెలియదు.. కానీ ఇప్పుడు వచ్చిన గెస్టుకు నీ గురించి అన్నీ తెలుసు కాబట్టి నువ్వేం మాట్లాడలేవు అంటూ నోరు మూయించేసాడు నాగ చైతన్య. మొత్తానికి స్యామ్ జామ్ షోలో సమంత, చైతూ కెమిస్ట్రీ మాత్రం అదిరిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Samantha akkineni, Telugu Cinema, Tollywood