శేఖర్ కమ్ములకు నాగ చైతన్య లవ్లీ గిఫ్ట్.. ట్వీట్ చేసిన దర్శకుడు..

ఆనంద్ అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల.

news18-telugu
Updated: February 15, 2020, 12:02 PM IST
శేఖర్ కమ్ములకు నాగ చైతన్య లవ్లీ గిఫ్ట్.. ట్వీట్ చేసిన దర్శకుడు..
Twitter
  • Share this:
ఆనంద్ అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తన తాజా చిత్రాన్ని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో 'లవ్ స్టోరి'పేరుతో తెరకెక్కిస్తోన్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న పాట రూపంలో ఓ బహుమతిని ప్రేక్షకులకు అందించింది చిత్రబృదం. ‘ఏయ్ పిల్లా’ అనే పేరుతో విడుదలైన సాంగ్ ఒక నిమిషం నిడివితో ఆకట్టుకుంది. ఆ సాంగ్‌లో నాగచైతన్య, సాయి పల్లవిల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉండనుందో తెలియజేసే ప్రయత్నం చేశారు. వారిద్దరి మధ్య సీన్స్‌ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మెట్రో ట్రైన్‌లో చైతన్యకు సాయి పల్లవి ముద్దు పెట్టే సీన్ తెగ ఆకట్టుకుంటోంది. దీంతో ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ సాంగ్ 24 గంటల్లో 3మిలియన్ వ్యూస్‌ను రాబట్టింది. అది అలా ఉంటే ఈ విడుదలైన సాంగ్ పట్ల సినీ వర్గాల నుండే కాక.. సినీ అభిమానుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా హీరో నాగ చైతన్య తన దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రేమగా ఓ గిఫ్ట్‌ను బహుకరించాడు. ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చైతూ బహుకరించిన కళ్లజోళ్లు పెట్టుకుని ఓ ఫోటో పంచుకున్నాడు. ఈసందర్భంగా చైతన్యకు ధన్యవాదాలు తెలుపుతూ... నెక్ట్స్ టీజర్ వస్తోంది. దానికి కూడా మరో గిఫ్ట్‌ను తయారు చేసుకోమ్మని సరదాగా పోస్ట్ చేశాడు. ఈ సినిమాకు రెహమాన్ శిష్యుడు పవన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాగా గతంలో ఈ సినిమాకు సంబందించి నాగ చైతన్య పై ఓ వీడియో విడుదలవ్వగా అందులో చైతన్య ఓ ఫిట్నెస్ సెంటర్‌లో పనిచేస్తూ ఆర్డినరీ బాయ్‌లా కనిపించాడు. దీంతో అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత ఎక్కువైంది.




ఇంతకు ముందు సాయిపల్లవితో ఫిదా వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ అందమైన ప్రేమకథపై అక్కినేని అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునిశిత ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాను సమ్మర్‌‌ హాలిడేస్‌ను టార్గెట్ చేసుకొని విడుదల కానుంది. ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్  కనకాల, ఈశ్వరి రావు, దేవయాని నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ కె నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
First published: February 15, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు