కొన్ని కొన్ని సార్లు అభిమానులు చేసే పనులు హీరోలను ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. కొన్ని సార్లు భయానికి కూడా గురి చేస్తుంటాయి. ఫ్యాన్స్ కోసం హీరోలు కూడా కొన్ని కొన్ని సార్లు రిస్క్‌లు చేస్తుంటారు. ‘మా ఫ్యాన్స్ ఒప్పుకోరు’ అంటూ కొన్ని రిస్కీ సీన్లను కూడా ఎలాంటి డూప్ లేకుండా చేస్తుంటారు. అయితే, తాజాగా ఓ యువకుడు తన అభిమాన హీరోను చూసేందుకు, అతడిని కలిసేందుకు ఏకంగా నదిలో దూకేశాడు. దీంతో హీరో కూడా ఓసారి కంగారుపడిపోయాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగచైతన్య ప్రస్తుతం థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకుడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల తూర్పుగోదావరిలో జరిగింది. అక్కడ నాగచైతన్యను చూసేందుకు చాలా మంది అభిమానులు వచ్చారు.
అక్కడ ఓ వంతెన మీద కూర్చున్న చాలా మంది నాగచైతన్యను చూస్తే చేతులు ఊపడం, అరుస్తూ తమ అభిమానాన్ని తెలిపారు. కొందరు కేకలు వేశారు. అంతులో ఓ యువకుడు నాగచైతన్యకు చేతులు చూపాడు. అందరూ చూస్తుండగానే ఏకంగా నదిలో దూకేశాడు.
Neekuna fanism ki avadhulu levu Anna @chay_akkineni ❤️?
Ne cult fanism level veru anthe ??#ThankYouTheMovie#LoveStoryOnApril16th pic.twitter.com/ImJjKZ4HOj
— Aarya Prasad (@Aaryaprasad) March 2, 2021
నదిలో దూకిన యువకుడు నాగచైతన్య పడవ వెనుక ఈదుకుంటూ వెళ్లాడు. ఫ్యాన్ అలా వంతెన మీద నుంచి దూకగానే నాగచైతన్య కూడా కంగారుపడ్డాడు. అతడిని అందుకోవడానికి అన్నట్టుగా చెయ్యి చాపాడు. ఆ తర్వాత ఆ ఫ్యాన్ ఈదుకుంటూ చైతన్య ఉన్న బోటు వద్దకు వెళ్లాడు. తన కోసం ఏకంగా నదిలో దూకిన అభిమానికి నాగచైతన్య కూడా అతడిని నొప్పించకుండా ఫొటో దిగి పంపించాడు. ప్రస్తుతం ఆ వీడియో మొత్తం వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Naga Chaitanya Akkineni, Tollywood, Tollywood Movie News