HOME »NEWS »MOVIE »naga chaitanya celebrates samantha birthday see pics here sr

HBDSamantha : సమంత పుట్టినరోజును సెలెబ్రేట్ చేసిన నాగచైతన్య..

HBDSamantha : సమంత పుట్టినరోజును సెలెబ్రేట్ చేసిన నాగచైతన్య..
పుట్టిన రోజు వేడుకలో సమంత నాగచైతన్య.. Photo : Instagram

Samantha : సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను.

  • Share this:
    Samantha : సమంత అక్కినేని తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను. ఆ సినిమాలో నాగచైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లిచేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరుగా వెలుగుతోంది. పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్యతో కలిసి చేసిన ‘మజిలీ’ మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత సోలో లీడ్‌గా వచ్చిన కొరియన్ రీమేక్‌ ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్‌ను రాబట్టి అదరగొట్టింది. అలా పోయిన సంవత్సరం సమంత అదరగొట్టిన ఈ సంవత్సరంలో సమంత మొదటి సినిమా ఆమెకు చేదు అనుభవాన్నే మిగిల్చిందనే చెప్పొచ్చు. శర్వానంద్‌‌తో కలిసి నటించిన 'జాను' ఆ మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా తమిళ మాతృక '96' ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీనితో పాటు సమంత ఓ రియాలిటీ షోకు జడ్జ్‌గా  చేయనున్నదని సమాచారం. సమంతలో మరో కోణం సామాజిక అంశాలపై స్పందించడం.. ఈ లక్షణం మనం అందరిలో చూడలేం. సమంత 'ప్రత్యూష సపోర్ట్' అనే ఓ ఎన్ జి ఓ ను నడుపుతూ అక్కడ బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు కావాల్సిన వైద్య, విద్య ఖర్చులను భరిస్తూ చాలా కుటుంబాలకు సాయంగా నిలబడింది. తన వంతుగా సాయం చేస్తూనే ఉంది.

    ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి జరుగాల్సీ వుంది కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇది కేవలం హారర్ చిత్రమే కాదనీ, అంతకు మించిన విషయమున్న చిత్రమని సమంత పేర్కొంది. తెలుగు, తమిళ భాషల్లో ఇది రూపొందుతుంది. మరో వార్త ఏమంటే సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గత ఏడాది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 'ఓ బేబీ' వచ్చి మంచి హిట్ అందుకుంది. ఈ తాజా సినిమా కన్నడ దియాకు రీమేక్‌గా వస్తోందట. కన్నడ సినిమా దియాను చూసిన సమంత ఆ రీమేక్‌లో నటించాలనీ కోరుకుంటుందట. అది అలా ఉంటే సమంత ఈరోజు తన 33వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నాగచైతన్య సొంతంగా ఓ కేకును తయారుచేసాడు. సమంత కట్ చేసింది. ప్రస్తుతం దానికి సంబందించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


    Published by:Suresh Rachamalla
    First published:April 28, 2020, 07:42 IST