Home /News /movies /

NAGA CHAITANYA AS BANGARRAJU MOVIE FIRST SINGLE NAA KOSAM RELEASE ON DECEMBER 1ST TA

Naga Chaitanya As Bangarraju : నాగ చైతన్య ‘బంగార్రాజు’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్..

నాగ చైతన్య ‘బంగార్రాజు’ ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

నాగ చైతన్య ‘బంగార్రాజు’ ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Naga Chaitanya As Bangarraju :  ఈ యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. మరోవైపు బంగర్రాజు మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారైంది.

ఇంకా చదవండి ...
    Naga Chaitanya As Bangarraju :  ఈ యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఈ మూవీ తర్వాత నాగ చైతన్య తన తండ్రి నాగార్జునతో కలిసి  ‘బంగార్రాజు’ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి నాగార్జున లెవల్లో నటించి ఔరా అనిపించారు. తండ్రి నాగార్జునతో నాగ చైతన్యకు ఇది మూడో సినిమా. మొదటి సారి వీళ్లిద్దరు కలిసి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘మనం’ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత నాగ చైతన్య తన తండ్రితో కలిసి ‘ప్రేమమ్’లో నటించారు. ఈ సినిమాలో చైతూ ఫాదర్ పాత్రలో నాగార్జున అదరగొట్టారు.

    తాజాగా నాగ చైతన్య.. తన తండ్రి నాగార్జునతో కలిసి మూడో సారి కలిసి ‘బంగార్రాజు’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.

    RRR : ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మరో అదిరిపోయే అప్‌డేట్.. ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్..

    పైగా నాగ చైతన్య పాత్ర కూడా బంగార్రాజుగా ఇంట్రడ్యూస్ చేయడంతో ఈ సినిమాలో యంగ్ ఏజ్ పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నట్టు కన్ఫామ్ అయింది.తాజాగా టీజర్‌లో కూడా బంగార్రాజుగా సోగ్గాడి గెటప్‌లో కనిపించాడు చైతూ. కర్ర పట్టుకుని స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి బైక్ వెక్కి వెళ్లిపోవడంతో టీజర్ అయిపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఖరారైంది.


    ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ ఫస్ట్ సాంగ్‌ను డిసెంబర్ 1న ఉదయం 11.12 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఈ సినిమాలో నాగ  చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. తొలిసారి వీళ్లిద్దరు జోడిగా నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

    Naga Chaitanya - ANR : అక్కినేని నాగేశ్వరరావు, నాగ చైతన్య సహా సినీ ఇండస్ట్రీ తాత మనవళ్లు..

    బంగార్రాజు విషయానికొస్తే..  ఒకే సినిమాలో తండ్రీ కొడుకులు టైటిల్ రోల్ పోషించడం విశేషం. గతంలో మోహన్ బాబు హీరోగా నటించిన ‘గాయత్రి’లో యంగ్ ఏజ్ పాత్రలో మంచు విష్ణు నటించారు. ఇపుడు అదే తరహాలో నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్నారు.

    Punarjanma - Radhe Shyam : తెలుగు సినిమాల్లో పునర్జన్మలు.. మగధీర,అరుంధతి, ఇపుడు రాధే శ్యామ్..

    మరోవైపు నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ‘థాంక్యూ’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. . ఈ లుక్‌లో నిచ్చెన పై కూర్చొని  కళ్ల జోడుతో హాయిగా నవ్వుతున్న నాగ చైతన్య లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.  మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.

    Chiranjeevi - Naga Babu : చిరంజీవి హీరోగా నాగ బాబు నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలు ఏమిటో తెలుసా..


    ఏమైనా నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ వంటి క్లాస్ లవ్ స్టోరీ తర్వాత.. ‘బంగార్రాజుగా మాస్ అప్పీల్‌తో ప్రేక్షకులన పలకరించబోతున్నారు. ఆ తర్వాత ‘లాల్ సింగ్ చద్ధా’లో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో మేనమావ వెంకటేష్‌తో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ‘వెంకీ మామ’ సినిమాలో ఆర్మీ సైనికుడి పాత్రలో నటించిన సంగతి  తెలిసిందే కదా. కానీ ఆమీర్ ఖాన్‌తో చేస్తోన్న ‘లాల్ సింగ్ చద్ధా’లో మాత్రం పూర్తి స్థాయిలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మొత్తంగా నాగ చైతన్య డిఫరెంట్ సినిమాలతో మంచి దూకుడు మీదున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bangarraju, Krithi shetty, Naga Chaitanya Akkineni, Nagarjuna Akkineni, Ramya Krishna, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు