Home /News /movies /

NAGA CHAITANYA AS BALARAJU IN AAMIR KHAN LAL SINGH CHADDHA MOVIE CHAITHU NEW LOOK UNVIELED TA

Naga Chaitanya As Balaraju : లాల్ సింగ్ చడ్డాలో సిపాయి బాలరాజుగా నాగ చైతన్య.. ఆకట్టుకుంటున్న చైతూ కొత్త లుక్..

’లాల్ సింగ్ చడ్డా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న నాగ చైతన్య  (Twitter/Photo)

’లాల్ సింగ్ చడ్డా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న నాగ చైతన్య (Twitter/Photo)

Naga Chaitanya As Balaraju in Aamir Khan Laal Singh Chaddha | నాగ చైతన్య ఇపుడు వరుసగా రెండు సినిమాలతో పలకరించబోతున్నారు. అందులో బాలీవుడ్ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ ఒకటి. ఆగష్టు 9న విడుదల కానున్న ఈ చిత్రంలో నాగ చైతన్య లుక్‌ను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    Naga Chaitanya As Balaraju : అక్కినేని నట వారసుడు అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ యేడాది ఇప్పటికే తన తండ్రితో ‘బంగార్రాజు’ సినిమాతో మంచి హిట్ అందుకొని మంచి ఊపు మీదున్నాడు. ఈ సినిమా తర్వాత ఇపుడు వరుసగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ మూవీతో ఈ శుక్రవారమే పలకరించనున్నాడు. అటు ఆమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో ఒకేసారి హిందీ, తెలుగు పాటు మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో  ఈ సినిమాకు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరు తన కెరీర్‌లో ‘రుద్రవీణ’, త్రినేత్రుడు’ సినిమాల తర్వాత సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న మూడో  చిత్రం ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ కావడం విశేషం.

    తాజాగా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్రకు సంబంధించిన లుక్‌‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య ‘బాలరాజు’ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ దక్షిణాదికి చెందిన యువకుడి పాత్రలో కనిపించనున్నారు. పైగా తన తాత అక్కినేని నాగేశ్వరరావుకు స్టార్‌డమ్ తీసుకొచ్చిన ‘బాలరాజు’ పాత్రలో ‘లాల్ సింగ్ చడ్దా’ లో కనిపించడం విశేషం.

    సిపాయి ‘బాలరాజు’గా నాగ చైతన్య (Twitter/Photo)


    ఇక అది అలా ఉంటే నాగ చైతన్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ‘థాంక్యూ’ తో పాటు   ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు.  దాంతో పాటు నాగ చైతన్య చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి.ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌‌లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌‌ను ఖరారు చేసారు.



    ‘థాంక్యూ’ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తున్నారు. ఇతర కీలకపాత్రల్లో అవికా గోర్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని 2గం 9 నిమిషాల నిడివి ఉంది. ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.  ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.  తమిళ దర్శకుడి వెంకట్ ప్రభుతో నాగ చైతన్య 22వ చిత్రం.. అధికారిక ప్రకటన చేశారు.  ఈ చిత్రంలో నాగ చైతన్య మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్టు చెప్పారు.  దాంతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ చిత్రానికి ఓకే చెప్పినట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Laal Singh Chaddha, Naga Chaitanya Akkineni, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు