హోమ్ /వార్తలు /సినిమా /

సమంత, నాగచైతన్యను కలిపే పనిలో.. ప్రముఖ డైరెక్టర్ ?

సమంత, నాగచైతన్యను కలిపే పనిలో.. ప్రముఖ డైరెక్టర్ ?

పెళ్లి తర్వాత కూడా మజిలీ సినిమాలో కూడా వీరిద్దరు కలిసి నటించారు. అయితే అనుకోకుండా సామ్ చైతు డైవర్స్ తీసుకొని విడిపోయారు.

టాలీవుడ్ ప్రముఖ జంట నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట విడాకులతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. వీరిద్దరూ కలిసి నటించిన అనేక సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగానే అలరించాయి. ఏం మాయ చేశావో సినిమాతో ఈ జంట తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా హిట్‌తో సమంతకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా... ఆటో నగర్ సూర్య, మనం లాంటి సినిమాల్లో నటించారు. పెళ్లి తర్వాత కూడా మజిలీ సినిమాలో కూడా వీరిద్దరు కలిసి నటించారు. అయితే అనుకోకుండా సామ్ చైతు డైవర్స్ తీసుకొని విడిపోయారు. దీంతో అభిమానులు కూడా చాలా కుంగిపోయారు. అయితే మరోసారి ఈ జంటను కలిసి ఒక్కదగ్గరి చూస్తే..ఆ ఫీలింగే వేరు. అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి.

‘జబర్దస్త్’ అనే మూవీతో దర్శకురాలు నందినిరెడ్డితో కలిసి సామ్ తొలిసారిగా పనిచేసింది. ఆ తర్వాత ‘ఓ బేబీ’ మూవీతో మళ్ళీ వీరిద్దరు కలిశారు. ఈ సారి ఈ కాంబో సూపర్ హిట్టైంది. దీని తర్వాత నందిని.. సమంతతో మరో సినిమా చేయాలనుకుంది. కానీ సాధ్యపడలేదు. ఆ తర్వాత సామ్ సినిమాల పరంగా బిజీ కావడం.. నాగచైతన్యతో విడిపోవడమూ జరిగాయి. అయినప్పటికీ నందినిరెడ్డి, సమంతల మధ్య ఫ్రెండ్ షిప్ ఇంకా కొనసాగుతునే ఉంది. ఆ స్నేహ బంధంతోనే నందిని రెడ్డి .. చైతును, సామ్‌ను మళ్ళీ కలపాలని ప్రయత్నిస్తోందని సమాచారం. కలపడం అంటే.. డైవర్స్ తీసుకున్న వీరిద్దర్నీ కలపడం కాదు.. ఆన్ స్క్రీన్ మీద ఇద్దర్ని కలిసి నటించేలా ప్రయత్నం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్.

త్వరలో నందిని రెడ్డి నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నంలో ఉంది. ఆ కథ చైతుకి బాగా నచ్చడంతో అతడు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే అందులో హీరోయిన్ గా పలువురు హీరోయిన్స్ ను అనుకున్నప్పటికీ ఎవరూ సెట్ కావడం లేదు. దాంతో చైతు సరసన సమంతనే కథానాయికగా ఎంపిక చేస్తే బాగుంటుందని నందినిరెడ్డి భావిస్తోందట. ఒకవేళ నందిని ప్రయత్నం సక్సెసై ఇద్దరూ కలిసి సినిమా చేస్తే అభిమానులకు పండగని వేరే చెప్పాలా? మరి నందినిరెడ్డి ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

First published:

Tags: Nandini Reddy, Samantha akkineni, Tollywood

ఉత్తమ కథలు