సాయిపల్లవి, నాగచైతన్య లవ్ స్టోరీ.. సమంత రియాక్షన్ ఇదే..

సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

news18-telugu
Updated: January 14, 2020, 7:43 PM IST
సాయిపల్లవి, నాగచైతన్య లవ్ స్టోరీ.. సమంత రియాక్షన్ ఇదే..
సాయిపల్లవి, నాగ చైతన్య
  • Share this:
సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో సాయిపల్లవి, నాగ చైతన్య భావోద్వేగంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడీ లుక్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. తెలంగాణ యువకుడిగా చైతన్య ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమా చైతూకు 19వ సినిమా కావడం గమనార్హం.

లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ లుక్ (Instagram Photo)


కాగా, చైతూ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేయగానే బోలెడన్ని లైకులు, కామెంట్లతో దద్దరిల్లిపోయింది. అభిమానులంతా రీట్వీట్లతో హోరెత్తించారు. అందులో చైతూ సతీమణి సమంత అక్కినేని కూడా ఉండటం విశేషం. ఆమె కూడా ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేసి భర్త సినిమా లుక్‌ను షేర్ చేసింది.

First published: January 14, 2020, 7:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading