ముద్దుతో నాగచైతన్యను ఏడిపించేసిన సాయిపల్లవి...

Love Story : మంచి కాఫీ లాంటీ చిత్రాలతో తెలుగువారి హృదయాలను దోచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల.

news18-telugu
Updated: February 14, 2020, 12:16 PM IST
ముద్దుతో నాగచైతన్యను ఏడిపించేసిన సాయిపల్లవి...
Twitter
  • Share this:
Love Story : మంచి కాఫీ లాంటీ చిత్రాలతో తెలుగువారి హృదయాలను దోచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తన తాజా చిత్రాన్ని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో 'లవ్ స్టోరి'పేరుతో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న పాట రూపంలో ఓ బహుమతిని ప్రేక్షకులకు అందించింది చిత్రబృదం. అందులో భాగంగా ఈరోజు ఉదయం ఉ. 11 గంటల 07 నిమిమిషాలకు ‘ఏయ్ పిల్లా’ అనే సాంగ్ ప్రివ్యూను రిలీజ్ చేసారు. ఒక నిమిషం నిడివి గల 'ఏయ్ పిల్లా' సాంగ్ నాగచైతన్య, సాయి పల్లవిల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ తెలియజేసేలా ఉండి తెగ ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య సీన్స్‌ చాలా బాగున్నాయి. ఓ సీన్‌లో మెట్రో ట్రైన్‌లో చైతన్యకు సాయి పల్లవి ముద్దు పెట్టగా, అతడు కన్నీరు పెట్టుకుంటాడు. దానికి సాయి పల్లవి ముద్దు పెడితే ఏడ్చేస్తారా అని అడగడం కుర్ర హృదయాలను ఆకట్టుకుంటోంది. దీనికి తోడు పాటలో లిరిక్స్ కూడా లవర్స్‌కు నచ్చే విధంగా ఉన్నాయి. రెహమాన్ శిష్యుడు పవన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాగా గతంలో ఈ సినిమాకు సంబందించి నాగ చైతన్య పై ఓ వీడియో విడుదలవ్వగా అందులో చైతన్య ఓ ఫిట్నెస్ సెంటర్‌లో పనిచేస్తూ ఆర్డినరీ బాయ్‌లా కనిపించాడు. దీంతో అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత ఎక్కువైంది.




ఇంతకు ముందు సాయిపల్లవితో ఫిదా వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ అందమైన ప్రేమకథపై అక్కినేని అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునిశిత ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాను సమ్మర్‌‌ హాలిడేస్‌ను టార్గెట్ చేసుకొని విడుదల కానుంది. ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్  కనకాల, ఈశ్వరి రావు, దేవయాని నటిస్తున్నారు. 'లవ్ స్టోరి' రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.  ఈ చిత్రాన్ని నారాయణ్ కె నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు