Naga Chaitanya-Sai Pallavi : లవ్ స్టోరి షూటింగ్ స్టార్ట్.. క్లైమాక్స్ చిత్రీకరణ అక్కడే..

లవ్ స్టోరీ: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాకు 32 కోట్ల ఓటిటి డీల్ వచ్చింది.

Naga Chaitanya-Sai Pallavi : నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరి పేరుతో శేఖర్ కమ్ముల ఓ సినిమాను సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరి పేరుతో శేఖర్ కమ్ముల ఓ సినిమాను సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శేఖర్ 'ఆనంద్' అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు. ఆయన సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు. తన తాజా చిత్రాన్ని నాగ చైతన్య సాయి పల్లవిలు హీరో హీరోయిన్స్‌గా ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. దాదాపు రెండు నెలల నుండి పెద్ద సినిమాలేవి షూటింగ్ జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్‌తో షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చిన పెద్దగా ఆసక్తి చూపించట్లేదు నటీ నటులు. రిస్క్ ఎందుకని అంతా ఇంట్లో కూర్చుంటున్నారు. చిన్నాచితకా సినిమాలు మాత్రం సెట్స్ పైకొచ్చాయి.

    ఈ విషయంలో అందరికంటే ముందుగా నాగచైతన్య చొరవ తీసుకునేలా కనిపిస్తున్నాడు. తన లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ను ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా లవ్ స్టోరీ ఫైనల్ షెడ్యూల్ ఈరోజు మొదలుకానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రామోజీ ఫిలింసిటీలో నిర్మించిన  ఓ సెట్‌లో చిత్రబృందం షూటింగ్ జరపనుంది.  ఈ షెడ్యూల్‌లో సాయిపల్లవి నాగచైతన్యలపై క్లైమాక్స్‌కు సంబందించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.



    ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవ్వుతూ అదరగొట్టింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉందట. దానికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది. ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నాడు.
    Published by:Suresh Rachamalla
    First published: