Naga Chaitanya Love Story: ఎట్టకేలకు చైతూ లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Naga Chaitanya Love Story

Naga Chaitanya Love Story: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లవ్ స్టోరీ'. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ విడుదలకు మాత్రం అనుకున్న సమయాన్ని నోచుకోలేదు.

  • Share this:
    Naga Chaitanya Love Story: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లవ్ స్టోరీ'. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాను ఏ ముహూర్తంలో ప్రారంభించారో కానీ విడుదలకు మాత్రం అనుకున్న సమయాన్ని నోచుకోలేదు. హిట్ ల కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్యకు ఎట్టకేలకు ఈ సినిమాలో అవకాశం రాగా ఈ సినిమా నాగచైతన్యను బాగా ఎదురు చూసేలా చేస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా బాగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మొత్తానికి ఈ సినిమా విడుదలకు ముహూర్తం కుదిరింది.

    ఇప్పటికే ఈ సినిమాలో ఫస్ట్ లుక్ పోస్టర్లు, పాటలు, టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ముఖ్యంగా సారంగదరియా అనే పాట మాత్రం రికార్డుని సాధించింది. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని తదితర నటులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా గతంలో విడుదల చేయాలని ఓ డేట్ ఫిక్స్ చేశారు. కానీ కోవిడ్ కారణంగా వాయిదా పడింది.

    ఇది కూడా చదవండి:సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

    ఆ తర్వాత కూడా మళ్లీ ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు సినీ బృందం. కానీ అప్పుడు కూడా ఈ సినిమాకు ముహుర్తం కుదరలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయలని సినీ బృందం ఫిక్స్ చేశారు. నిజానికి ఈ సినిమాను ఈ రోజే విడుదల చేయాలని అనుకోగా ఈరోజు నాని నటించిన టక్ జగదీష్ సినిమా విడుదలకి ఉందని వాయిదా వేశారు.

    ఇది కూడా చదవండి:నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ ఖతం.. గుమ్మడికాయ కొట్టిన శేఖర్ కమ్ముల..

    మొత్తానికి ఈ సినిమా కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు, సిని బృందాలకు ఈ సినిమా విడుదల పై అసలైన క్లారిటీ ఇప్పుడు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఎన్ని రోజులు వాయిదా పడుతున్న ఈ సినిమా.. విడుదల తర్వాత ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published: