మంచి రేటుకు శేఖర్ కమ్ముల లవ్‌స్టోరి... కారణం ఆమెనట..

'ఆనంద్' అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల.

news18-telugu
Updated: April 24, 2020, 6:30 AM IST
మంచి రేటుకు శేఖర్ కమ్ముల లవ్‌స్టోరి... కారణం ఆమెనట..
నాగ చైతన్య, సాయి పల్లవి Photo : Twitter
  • Share this:
'ఆనంద్' అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు. ఆయన తన తాజా చిత్రాన్ని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో 'లవ్ స్టోరి'పేరుతో తెరకెక్కిస్తోన్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవ్వుతూ అదరగొట్టింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉందట. దానికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది. ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఈయన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరుతో ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Published by: Suresh Rachamalla
First published: April 24, 2020, 6:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading