Love Story : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరి వస్తోన్న సంగతి తెలిసిందే. మంచి కాఫీ లాంటీ చిత్రాలతో తెలుగువారి హృదయాలను దోచుకున్న శేఖర్ కమ్ముల తన తాజా చిత్రాన్ని నాగ చైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరిగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సినిమా చాలావరకు షూటింగ్ జరపుకుంది. సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. అది అలా ఉంటే ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న పాట లవ్ స్టోరి నుంచి పాట రూపంలో ఓ బహుమతిని ప్రేక్షకులకు అందించింది చిత్రబృదం. ‘ఏయ్ పిల్లా’ అనే పేరుతో రిలీజైన సాంగ్ ప్రివ్యూను యూట్యూబ్‌లో విడదుల చేశారు. ఒక నిమిషం నిడివి గల 'ఏయ్ పిల్లా' సాంగ్ నాగచైతన్య, సాయి పల్లవిల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ తెలియజేసేలా ఉండి తెగ ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య సీన్స్ చాలా బాగున్నాయి. ఓ సీన్లో మెట్రో ట్రైన్లో చైతన్యకు సాయి పల్లవి ముద్దు పెట్టగా, అతడు కన్నీరు పెట్టుకుంటాడు. దానికి సాయి పల్లవి ముద్దు పెడితే ఏడ్చేస్తారా అని అడగడం కుర్ర హృదయాలను ఆకట్టుకుంటోంది. దీనికి తోడు పాటలో లిరిక్స్ కూడా లవర్స్‌కు నచ్చే విధంగా ఉన్నాయి. రెహమాన్ శిష్యుడు పవన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన నాటి నుండి తెగ వైరల్ అవుతోంది. పాటలోని లిరిక్స్, చైతన్య, సాయి పల్లవిల నటన తెగ నచ్చేస్తోంది. దీంతో ఈ పాట ఇప్పటికే 4 మిలియన్ల వ్యూస్ రాబట్టి సంచలనం సృష్టించింది.
కాగా శేఖర్ కమ్ముల ఇంతకు ముందు సాయిపల్లవితో ఫిదా వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత తెరకెక్కుతోన్న ఈ అందమైన ప్రేమకథపై అక్కినేని అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు, దేవయాని నటిస్తున్నారు. 'లవ్ స్టోరి' రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని నారాయణ్ కె నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.