షూటింగ్‌కు రెడీ అంటోన్న నాగ చైతన్య.. సాయి పల్లవి..

Naga Chaitanya : నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరి పేరుతో శేఖర్ కమ్ముల ఓ సినిమాను సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 11, 2020, 6:53 AM IST
షూటింగ్‌కు రెడీ అంటోన్న నాగ చైతన్య.. సాయి పల్లవి..
లవ్ స్టోరిలో సాయి పల్లవి, నాగ చైతన్య Photo : Twitter
  • Share this:
నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో లవ్ స్టోరి పేరుతో శేఖర్ కమ్ముల ఓ సినిమాను సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శేఖర్ 'ఆనంద్' అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు. ఆయన సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు. తన తాజా చిత్రాన్ని నాగ చైతన్య సాయి పల్లవిలు హీరో హీరోయిన్స్‌గా ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. దాదాపు రెండు నెలల నుండి పెద్ద సినిమాలేవి షూటింగ్ జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్‌తో షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చిన పెద్దగా ఆసక్తి చూపించట్లేదు నటీ నటులు. రిస్క్ ఎందుకని అంతా ఇంట్లో కూర్చుంటున్నారు. చిన్నాచితకా సినిమాలు మాత్రం సెట్స్ పైకొచ్చాయి. కాస్త రిస్క్ చేసి పనికానిస్తున్నారు. ఈ విషయంలో అందరికంటే ముందుగా నాగచైతన్య చొరవ తీసుకునేలా కనిపిస్తున్నాడు. తన లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా వచ్చే నెల రెండో వారం నుంచి లవ్ స్టోరీ ఫైనల్ షెడ్యూల్ మొదలుకానుందని సమాచారం. ఈ మేరకు రామోజీ ఫిలింసిటీలో ఓ సెట్ నిర్మిస్తోంది చిత్రబృందం. సాయిపల్లవి కూడా ఒప్పుకోవడంతో షూటింగ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి ఓ పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవ్వుతూ అదరగొట్టింది. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్‌లో మంచి డిమాండ్ ఉందట. దానికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది. ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఈయన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరుతో ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Published by: Suresh Rachamalla
First published: July 11, 2020, 6:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading