news18-telugu
Updated: October 4, 2020, 7:06 PM IST
నాగ చైతన్య (Twitter/Photo)
Naga Chaitanya | హీరోగా నాగ చైతన్యకు మంచి సక్సెస్లున్న మాస్లో మాత్రం అనుకున్నంత క్రేజ్ రాలేదు. చాలా మంది నట వారసులు మాస్ హీరోలుగా చెలరేగి పోతుంటే.. నాగ చైతన్య.. మిడ్ రేంజ్ లెవల్ హీరోగానే సరిపెట్టుకుంటున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తిగా క్లాస్ సినిమా. ముఖ్యంగా శేఖర్ కమ్ముల శైలిలో ఈ సినిమా ఉంటుందని సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ‘లవ్ స్టోరీ’ వంటి క్లాస్ సినిమా తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి హిల్లేరియస్ మాస్ ఎంటర్టేనర్ చేయడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం మాస్లో ఫాలోయింగ్ కోసం.. నాగచైతన్య.. అనిల్ రావిపూడితో పూర్తి మాస్ కామెడీ ఫిల్మ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.ఈ సినిమా అప్పట్లో నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’, ‘ప్రెసిడెంటు గారి పెళ్లాం’ ‘హలో బ్రదర్ తరహాలో ఉంటుందని చెబుతున్నారు.

నాగ చైతన్య, అనిల్ రావిపూడి (Twitter/Photo)
ఇప్పటి వరకు లవర్ బాయ్‌గా అలరించిన నాగ చైతన్య.. ఇపుడు పూర్తిస్థాయి ఔట్ అండ్ ఔట్ మాస్ హీరోగా ఈ సినిమాలో అలరించనున్నాడని సమాచారం. గతంలో నాగ చైతన్య.. ‘జోష్’, బెజవాడ’, సవ్యసాచి’ ‘తడాకా’ వంటి సినిమాల్లో మాస్ క్యారెక్టర్ చేసినా.. ఎందుకో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. ఒక్క తడాఖా మాత్రం మినహాయింపు అనే చెప్పాలి. నాగ చైతన్య, అనిల్ రావిపూడి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం. తొలి సినిమా తరువాత అనిల్ రావిపూడి వరసగా దిల్ రాజు బ్యానర్లోనే సినిమాలు చేస్తున్నాడు. ఇపుడు చైతూతో చేయబోయే సినిమాను కూడా దిల్ రాజు నిర్మించనున్నాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో కూడా ఓ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. మరి అనిల్ రావిపూడి సినిమాతోనైనా.. మాస్ హీరోగా నాగ చైతన్య అలరిస్తాడా లేదా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 4, 2020, 7:06 PM IST