Home /News /movies /

NAGA CHAITANYA AKKINENI THANK YOU MOVIE TEASER RELEASE ON 25TH MAY TA

Naga Chaitanya - Thank You : నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీ ఫస్ట్ లుక్‌కు ముహూర్తం ఫిక్స్..

నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్ విడుదల తేది ఖరారు (Twitter/Photo)

Naga Chaitanya - Thank You : ‘బంగార్రాజు’ తర్వాత నాగ చైతన్య సోలో హీరోగా నటించిన చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఎపుడు విడుదల చేసేది ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Naga Chaitanya : నాగ చైతన్య గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా తన తండ్రి నాగార్జునతో కలిసి ఈయన చేసిన  సినిమా బంగార్రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ’మజిలీ’ తర్వాత ’లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో కెరీర్‌లో ఫస్ట్ హాట్రిక్ అందుకున్నాడు. అంతకు ముందు ’వెంకీ మామ’ సినిమా కూడా సక్సెస్ అయింది. అది కలుపుకుంటే వరుసగా నాలుగు హిట్స్ అందుకున్నట్టు లెక్క.  ఇక అది అలా ఉంటే నాగ చైతన్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు.  దాంతో పాటు నాగ చైతన్య చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి.

    ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌‌లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌‌ను ఖరారు చేసారు. నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘థాంక్యూ’ పేరుతో వస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకొంచెం ప్యాచ్ వర్క్ మిగిలిఉంది.  త్వరలోనే  ఈ సినిమా విడుదల తేదినీ ప్రకటించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మే 25న సాయంత్రం 5 గంటలకు 4 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    ‘థాంక్యూ’ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తున్నారు. ఇతర కీలకపాత్రల్లో అవికా గోర్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.  మరోవైపు  ఇక చైతన్య హిందీలో తొలిసారి ‘లాల్ సింగ్ చద్ధా’లో నటించారు.  ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 11న విడుదల చేస్తున్నారు.


    తాజాగా తమిళ దర్శకుడి వెంకట్ ప్రభుతో నాగ చైతన్య 22వ చిత్రం.. అధికారిక ప్రకటన చేశారు. మరోవైపు  నాగ చైతన్యతో తన బావ  రానా దగ్గుబాటితో కలిసి ఓ సూపర్ హిట్ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రీసెంట్‌గా తమిళంలో శింబు, ఎస్.జే.సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘మానాడు’ సినిమాను తెలుగు రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఇపుడీ రీమేక్‌లో శింబు పాత్రలో నాగ చైతన్య, ఎస్.జే. సూర్య పాత్రలో రానా దగ్గుబాటి నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Naga Chaitanya Akkineni, Thank You Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు