Naga Chaitanya | Thank You : నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘థాంక్యూ’ పేరుతో వస్తోన్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు చేసుకుంటోంది.
Naga Chaitanya - Thank You : అక్కినేని నటవారసుడు నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. అది అలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘థాంక్యూ’ పేరుతో వస్తోన్న ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు చేసుకుంటోంది. అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా.. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలకానుందని, కొన్ని వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థతో మంచి ఫ్యాన్సీ రేటుకు డీల్ కుదరిందని, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ పుకార్లపై థాంక్యూ మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సమయం వచ్చినప్పుడు చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌లో విడుదల చేస్తామని స్పష్టం చేసింది టీమ్. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, మూవీ థియేటర్లో మంచి వినోదం పంచుతుందంటూ పుకార్లకు చెక్ పెట్టారు మేకర్స్. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను విడుదల చేసింది టీమ్.
థాంక్యూ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తున్నారు. ఇతర కీలకపాత్రల్లో అవికా గోర్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. ఇక చైతన్య హిందీలో తొలిసారి ‘లాల్ సింగ్ చద్ధా’లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.
ఇక నాగ చైతన్య Bangarraju బంగార్రాజు విషయానికి వస్తే.. ఈ సినిమాలో నాగచైతన్య, నాగార్జున కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి నాగార్జున (Nagarjuna) లెవల్లో నటించి ఔరా అనిపించారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ‘నా కోసం’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట మెలోడియస్గా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఈ పాటను బాలాజీ రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుందని తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జవనరి 7న ముందుగా సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో రంగంలోకి దిగుతోంది. దాంతో పాటు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ జనవరి 14న విడుదల కానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’, జనవరి 12న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంత గట్టి పోటీలో కూడా నాగార్జున, నాగా చైతన్య ... నేనున్నంటూ బంగార్రాజు మూవీతో బరిలో దిగబోతున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.