హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya - Thank You : ‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల..

Naga Chaitanya - Thank You : ‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల..

‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

Naga Chaitanya - Thank You : ‘థాంక్యూ’ మూవీ నుంచి అక్కినేని  నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల.. నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈ రోజు చైతూ బర్త్ డే సందర్భంగా ‘బంగార్రాజు’ టీజర్‌తో పాటు తాజాగా ‘థాంక్యూ’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఇంకా చదవండి ...

  Naga Chaitanya - Thank You : ‘థాంక్యూ’ మూవీ నుంచి అక్కినేని  నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల.. నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఈ రోజు నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ‘బంగార్రాజు’ మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి నాగార్జున లెవల్లో నటించి ఔరా అనిపించారు. వీటితో పాటు నాగ చైతన్య.. తన తండ్రి నాగార్జునతో కలిసి రెండో సారి కలిసి ‘బంగార్రాజు’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది.

  పైగా నాగ చైతన్య పాత్ర కూడా బంగార్రాజుగా ఇంట్రడ్యూస్ చేయడంతో ఈ సినిమాలో యంగ్ ఏజ్ పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నట్టు కన్ఫామ్ అయింది.తాజాగా టీజర్‌లో కూడా బంగార్రాజుగా సోగ్గాడి గెటప్‌లో కనిపించాడు చైతూ. కర్ర పట్టుకుని స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి బైక్ వెక్కి వెళ్లిపోవడంతో టీజర్ అయిపోతుంది.

  Naga Chaitanya - ANR : అక్కినేని నాగేశ్వరరావు, నాగ చైతన్య సహా సినీ ఇండస్ట్రీ తాత మనవళ్లు..

  ఇలా ఒకే సినిమాలో తండ్రీ కొడుకులు టైటిల్ రోల్ పోషించడం విశేషం. గతంలో మోహన్ బాబు హీరోగా నటించిన ‘గాయత్రి’లో యంగ్ ఏజ్ పాత్రలో మంచు విష్ణు నటించారు. ఇపుడు అదే తరహాలో నాగార్జున, నాగ చైతన్య నటిస్తున్నారు.

  ఈ రోజు నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ‘థాంక్యూ’ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్‌లో నిచ్చెన పై కూర్చొని  కళ్ల జోడుతో హాయిగా నవ్వుతున్న నాగ చైతన్య లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.  మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ హార్రర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్టున్నారు. ఇక ఈయన హిందీలో తొలిసారి నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నారు.

  Chiranjeevi - Naga Babu : చిరంజీవి హీరోగా నాగ బాబు నిర్మాతగా తెరకెక్కించిన సినిమాలు ఏమిటో తెలుసా..


  ఏమైనా నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ వంటి క్లాస్ లవ్ స్టోరీ తర్వాత.. ‘బంగార్రాజుగా మాస్ అప్పీల్‌తో ప్రేక్షకులన పలకరించబోతున్నారు. ఆ తర్వాత ‘లాల్ సింగ్ చద్ధా’లో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. గతంలో మేనమావ వెంకటేష్‌తో రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ‘వెంకీ మామ’ సినిమాలో ఆర్మీ సైనికుడి పాత్రలో నటించిన సంగతి  తెలిసిందే కదా. కానీ ఆమీర్ ఖాన్‌తో చేస్తోన్న ‘లాల్ సింగ్ చద్ధా’లో మాత్రం పూర్తి స్థాయిలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మొత్తంగా నాగ చైతన్య డిఫరెంట్ సినిమాలతో మంచి దూకుడు మీదున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bangarraju, Naga Chaitanya Akkineni, Thank You Movie, Tollywood

  ఉత్తమ కథలు