మరోసారి జంటగా నాగ చైతన్య, సమంత.. దర్శకుడు ఎవరంటే..

నాగ చైతన్య, సమంత జంటగా మరో సినిమా తెరకెక్కనుంది. వీళ్లిద్దరు మరో ఇద్దరు క్రేజీ డైరెక్టర్స్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

news18-telugu
Updated: July 2, 2020, 7:48 PM IST
మరోసారి జంటగా నాగ చైతన్య, సమంత.. దర్శకుడు ఎవరంటే..
నాగ చైతన్య, సమంత Photo : Twitter
  • Share this:
అక్కినేని సమంత.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఏమాయ చేసావే' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుండి నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది సమంత. ఇక తన మొదటి హీరో నాగచైతన్య నే వివాహం చేసుకుని తెలుగింటి కోడలైంది. సమంత తాజా సినిమా జాను. తమిళ సినిమా 96కు తెలుగు రీమేక్ ఇది. మంచి అంచనాల మధ్య విడుదలై పెద్దగా అలరించలేకపోయింది. అయినా.. 'జాను'లో సమంత నటన మంచి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత సమంత తన తదుపరి చిత్రం లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనున్నారని తెలుస్తోంది. గతేడాది వీళ్లిద్దరు కలిసి నటించిన ‘మజిలీ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైయింది. ఆ తర్వాత ‘ఓ బేబి’లో నాగ చైతన్య గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చాడు. తాజాగా వీళ్లిద్దరు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం.

Samantha and naga chaitanya, Samantha news,Samantha updates,Samantha films,Samantha pics,nandini reddy, naga chaitanya, telugu film news, నాగ చైతన్య, సమంత, నందిని రెడ్డి
నాగ చైతన్య, సమంత Photo : Twitter


ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. గతంలో వీళ్లిద్దరు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మనం’ సినిమలో నటించారు. ఇపుడు మరోసారి ఆయన దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు వీళ్లిద్దరు కలిసి నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు  అక్కినేని కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నాగ చైతన్య.. సాయి పల్లవితో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత విక్రమ్ కుమార్, నందిని రెడ్డి సినిమాలు తెరకెక్కే అవకాశాలున్నాయి.
First published: July 2, 2020, 7:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading