NAGA CHAITANYA AKKINENI LIKELY ENTRY INTO BOLLYWOOD AS LIKE SAMANTHA HERE ARE THE DETAILS TA
Naga Chaitanya - Samantha: భార్య సమంత అడుగు జాడల్లో భర్త నాగ చైతన్య.. ఎంతవారు కానీ..
సమంత నాగ చైతన్య (samantha naga chaitanya)
Naga Chaitanya Akkineni Samantha: టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లలో నాగ చైతన్య సమంత ఒకరు. తాజాగా నాగ చైతన్య... భార్య సమంత రూట్లో ఆ పని చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
Naga Chaitanya Akkineni Samantha: టాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్‌లలో నాగ చైతన్య సమంత ఒకరు. వీళ్లిద్దరు తొలిసారిగా ‘ఏం మాయ చేసావే’ సినిమాలో కలిసి నటించారు. హీరోయిన్గా సమంతకు అదే మొదటి సినిమా. ఇక కథానాయకుడిగా నాగ చైతన్యకు రెండో సినిమా. ఈ సినిమాతో నాగ చైతన్య, సమంత కూడా తొలిసారి హిట్ అందుకున్నారు. ఏం మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి ప్రేమ .. పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. పెళ్లి తర్వాత సమంత కూడా సినిమాలు చేసే విషయంలో దూకుడు మీదుంది. అంతేకాదు అక్కినేని హీరోలు హిట్ కోసం ఎదురు చూస్తుంటే.. సమంత మాత్రం వరుస హిట్స్‌తో దూసుకుపోతూనే ఉంది. సమంత ఓ వైపు సినిమాలు మాత్రమే కాదు.. ఆహా ఓటీటీలో సామ్ జామ్ ప్రోగ్రామ్‌తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం సమంత హిందీలో ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్‌లో నటించింది.
ఈ వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో సమంత .. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తోంది. ఫిబ్రవరిలో 12న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఇపుడు సమంత బాటలో అక్కినేని నాగ చైతన్య కూడా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
నాగ చైతన్య, సమంత (Twitter/Photo)
హిందీలో ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’లో నాగ చైతన్య కీలక పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన ఓ యువకుడి పాత్ర ఉందట. కథను కీలక మలుపు తిప్పే అతికీలకమైన ఆ క్యారెక్టర్ నాగ చైతన్య చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో చైతూను సంప్రదించరట. ఇక నాగ చైతన్య కూడా ఈ క్యారెక్టర్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్లో నాగ చైతన్య తండ్రి నాగార్జున పలు చిత్రాల్లో నటించారు. ఇపుడు ’బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు. ఇపుడు తండ్రి నాగ్ బాటలోనే నాగ చైతన్య కూడా ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో తెరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. మొత్తంగా సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యేడాదిలోనే నాగ చైతన్య కూడా బీటౌన్ ఎంట్రీ ఇవ్వబోవడంతో అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు.