హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya - Custody: నాగ చైతన్య ‘కస్టడీ’ మూవీ టీజర్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్..

Naga Chaitanya - Custody: నాగ చైతన్య ‘కస్టడీ’ మూవీ టీజర్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్..

నాగ చైతన్య ‘కస్టడీ’ 
టీజర్‌కు ముహూర్తం ఫిక్స్  (Twitter/Photo)

నాగ చైతన్య ‘కస్టడీ’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

Naga Chaitanya - Custody : థాంక్యూ సినిమా తర్వాత నాగ చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ ఎపుడు విడుదల చేసేది ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Naga Chaitanya - Custody : థాంక్యూ సినిమా తర్వాత నాగ చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నాగచైతన్య కెరీర్ 22వ మూవీగా వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.  రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు నాగ చైతన్య మొదలు పెట్టాడు. ఈ సినిమాలో హై ఆక్టేన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక అది అలా ఉంటే నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా  విడుదల చేసిన  చైతన్య లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  సాహసం శ్వాసగా సాగిపో తర్వాత  ఈ సినిమాలో చైతన్య మరోసారి పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. బంగార్రాజు తర్వాత మరోసారి ఈ సినిమాలో  కృతి శెట్టి చైతూ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఈ నెల 16న సాయంత్రం 4 గంటల 51 నిమిషాలకు విడుదలచేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఒంటిపై ఖాకీ డ్రెస్‌తో వస్తున్న నాగ  చైతన్య ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులను ఏ మెప్పిస్తాడనేది చూడాలి. టాలెంటెడ్‌ యాక్టర్‌ అరవింద్‌ స్వామి విలన్ గా నటిస్తున్నారు. నాగ చైతన్య గత సినిమాలకు బిన్నంగా ఈ సినిమా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు.

ఇక మరో వైపు నాగ చైతన్య సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌‌లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌‌ను ఖరారు చేసారు.

మరోవైపు  ఇక చైతన్య హిందీలో తొలిసారి ‘లాల్ సింగ్ చద్ధా’లో నటించారు.  ఈ సినిమా బాలీవుడ్  బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. తొలిసారి హిందీలో నటించిన నాగ చైతన్యకు ఈ సినిమాతో పరాజయాన్ని చవిచూసాడు. ఈ సినిమాలో ఆమీర్‌ ఖాన్‌తో సమానమైన పాత్రలో నటించి ఓకే అనిపించాడు.

First published:

Tags: Custody Movie, Naga Chaitanya Akkineni, Tollywood

ఉత్తమ కథలు