నిజమే.. నాగ చైతన్య ఇప్పుడు చరిత్రలో నిలిచిపోయాడు. ఆయనకు సాధ్యమైన రికార్డులు తెలుగులో మరే హీరోకు సాధ్యం కాలేదు. బహుశా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ నటుడికి రాని అదృష్టం ఇప్పుడు చైతూకు వచ్చింది. ఈయన ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్ 13న విడుదల కానుంది ఈ చిత్రం. ఇందులో వెంకటేష్ మరో హీరోగా నటించాడు. బాబీ దర్శకుడు. జై లవకుశ లాంటి సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని వెంకీ మామ సినిమా తెరకెక్కించాడు బాబీ. ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సొంత మేనమామ వెంకటేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చైతూ.
మామయ్యతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు చై. తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా కూడా మనం, వెంకీ మామ స్పెషల్ అంటున్నాడు ఈయన. అయితే ఇక్కడే నాగ చైతన్య ఓ రేర్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. గతంలో మనం సినిమాలో తాత, తండ్రితో కలిసి నటించాడు చై. తెలుగులో మరే హీరోకు దక్కని అదృష్టం అది. అలాగే మజిలి సినిమాలో భార్య సమంతతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.
పెళ్లికి ముందు ఏ మాయ చేసావే, మనం, ఆటోనగర్ సూర్య సినిమాల్లో కలిసి నటించారు ఈ జోడీ. ఇక పెళ్లి తర్వాత మజిలీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు మామయ్యతో వెంకీ మామలో నటించాడు చైతూ. ఇలా మనం సినిమాలో తాత తండ్రులతో.. మజిలీలో భార్యతో.. వెంకీమామలో మేనమామతో కలిసి నటించి ఈ తరం హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని రేర్ ఫీట్ అందుకున్నాడు చైతూ. తెలుగు ఇండస్ట్రీలో ఈ అరుదైన అవకాశం మరే హీరోకు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Naga Chaitanya, Nagarjuna Akkineni, Samantha, Telugu Cinema, Tollywood, Venkatesh