NAGA CHAITANYA AKKINENI AKHIL LOVE STORY MOVIE NOT 100 PERCENT OCCUPANCY IN ANDHRA PRADESH BUT AKHIL MOST ELIGIBLE BACHELOR MOVIE GET 100 PERCENT OCCUPANCY TA
Naga Chaitanya - Akhil : నాగచైతన్యకు కలిసిరాని అదృష్టం.. అఖిల్‌కు కలిసొచ్చింది అంటున్నారు సినీ అభిమానులు. వివరాల్లోకి వెళితే.. గత నెల 24న తేదిన నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. దాదాపు రూ. 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ‘లవ్ స్టోరీ’ ..కరోనా తర్వాత రూ. 32 కోట్ల షేర్ వసూళ్లు చేసి లాభాల్లోకి వచ్చి కరోనా సెకండ్ వేవ్ తర్వాత బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. హాలు నిండినది అనే బోర్డు చూసి కూడా చాలా నెలలు అయిపోతున్న తరుణంలో లవ్ స్టోరీ సినిమా మళ్లీ పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజు అబౌ యావరేజ్ టాక్ వచ్చింది కానీ టాక్‌తో పని లేకుండా కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే చైతూ చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసాడు. శేఖర్ కమ్ముల ఇమేజ్.. సాయి పల్లవి మ్యాజిక్ కలిపి లవ్ స్టోరి సినిమాకు మంచి వసూళ్లు తీసుకొచ్చాయి. ఇక తెలంగాణ 100 శాతం ఆక్యుపెన్షీతో సినిమాలు రన్ అవ్వగా.. ఏపీలో మాత్రం 50 శాతం ఆక్యుపెన్షీతో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు. ఒకవేళ ఏపీలో 100 శాతం సీటింగ్ కెపాసిటీ ఉంటే.. మరో ఐదారు కోట్లు అదనంగా ఈ సినిమాకు వచ్చేవి.
కానీ తాజాగా ఏపీ ప్రభుత్వం 100 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్స్ రన్ చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. దీంతో ఈ దసరాకు విడుదలవుతున్న అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాకు ఇది వర్కౌట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హీరోగా వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది.అటు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం.
మరోవైపు నాగార్జున కూడా తన కుమారుడికి మంచి హిట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది.
ఒక రకంగా 100 శాతం ఆక్యుపెన్షీని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ రూపంలో రాబట్టుకుంటుందో చూడాలి. మొత్తంగా అక్కినేని అభిమానులు మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. అంతేకాదు.. అన్నయ్య నాగ చైతన్యకు కలిసిరాని అదృష్టం.. తమ్ముడు అఖిల్‌కు దక్కిందంటున్నారు. మరి అంచనాలకు తగ్గట్టే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో అఖిల్ హీరోగా సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.