హోమ్ /వార్తలు /movies /

Naga Chaitanya : తమిళ దర్శకుడితో నాగ చైతన్య 22వ చిత్రం.. అధికారిక ప్రకటన..

Naga Chaitanya : తమిళ దర్శకుడితో నాగ చైతన్య 22వ చిత్రం.. అధికారిక ప్రకటన..

Naga Chaitanya  Venkat Prabhu : నాగ చైతన్య గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత బంగార్రాజు మూవీతో మరో సక్సస్ అందుకున్నారు. తాజాగా నాగ చైతన్య మరో తమిళ దర్శకుడికి ఓకే చెప్పాడు.

Naga Chaitanya  Venkat Prabhu : నాగ చైతన్య గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత బంగార్రాజు మూవీతో మరో సక్సస్ అందుకున్నారు. తాజాగా నాగ చైతన్య మరో తమిళ దర్శకుడికి ఓకే చెప్పాడు.

Naga Chaitanya  Venkat Prabhu : నాగ చైతన్య గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. ఆ తర్వాత బంగార్రాజు మూవీతో మరో సక్సస్ అందుకున్నారు. తాజాగా నాగ చైతన్య మరో తమిళ దర్శకుడికి ఓకే చెప్పాడు.

    Naga Chaitanya  Venkat Prabhu : నాగ చైతన్య గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా తన తండ్రి నాగార్జునతో కలిసి ఈయన చేసిన  సినిమా బంగార్రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ’మజిలీ’ తర్వాత ’లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో కెరీర్‌లో ఫస్ట్ హాట్రిక్ అందుకున్నాడు.  . ఇక అది అలా ఉంటే నాగ చైతన్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. దాంతో పాటు నాగ చైతన్య చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి.

    తాజాగా తమిళ దర్శకుడి వెంకట్ ప్రభుతో నాగ చైతన్య 22వ చిత్రం.. అధికారిక ప్రకటన చేశారు. అవును ఈ మధ్యకాలంలో మన హీరోలు తెలుగు దర్శకులు కాకుండా పరభాష దర్శకులతో బై లింగ్వల్ వీలైతే.. ప్యాన్ ఇండియా మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్.. తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అటు రామ్ పోతినేని కూడా లింగుసామితో ‘వారియర్’ మూవీ చేస్తున్నారు. అటు గోపీచంద్ కూడా సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం.తాజాగా ఈ కోవలో నాగ చైతన్య .. తమిళంలో టాప్ డైరెక్టర్‌గా సత్తా చాటుతున్న వెంకట్ ప్రభు దర్శకత్వంలో నెక్ట్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగా నాగ చైతన్యకు ఇది 22వ మూవీ.

    తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో నాగ చైతన్య22వ చిత్రం (Twitter/Photo)

    ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌‌లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌‌ను ఖరారు చేసారు. నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ‘థాంక్యూ’ పేరుతో వస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకొంచెం ప్యాచ్ వర్క్ మిగిలిఉంది.  త్వరలోనే  ఈ సినిమా విడుదల తేదినీ ప్రకటించనున్నారు. ‘థాంక్యూ’ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తున్నారు. ఇతర కీలకపాత్రల్లో అవికా గోర్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.  మరోవైపు  ఇక చైతన్య హిందీలో తొలిసారి ‘లాల్ సింగ్ చద్ధా’లో నటించారు.  ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 11న విడుదల చేస్తున్నారు.

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన రికార్డ్.. మళ్లీ బ్రేక్ చేయాలంటే రాజమౌళి రావాలేమో..

    మరోవైపు  నాగ చైతన్యతో తన బావ  రానా దగ్గుబాటితో కలిసి ఓ సూపర్ హిట్ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రీసెంట్‌గా తమిళంలో శింబు, ఎస్.జే.సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘మానాడు’ సినిమాను తెలుగు రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ దక్కించుకుంది. ఇపుడీ రీమేక్‌లో శింబు పాత్రలో నాగ చైతన్య, ఎస్.జే. సూర్య పాత్రలో రానా దగ్గుబాటి నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

    First published:

    ఉత్తమ కథలు