హోమ్ /వార్తలు /సినిమా /

Naga Chaitanya - Aamir Khan: ‘లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్‌లో ఆమీర్‌తో నాగ చైతన్య.. జవాన్ గెటప్‌లో చైతన్య కొత్త లుక్ అదుర్స్..

Naga Chaitanya - Aamir Khan: ‘లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్‌లో ఆమీర్‌తో నాగ చైతన్య.. జవాన్ గెటప్‌లో చైతన్య కొత్త లుక్ అదుర్స్..

’లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్‌లో ఆమీర్‌తో నాగ చైతన్య (Twitter/Photo)

’లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్‌లో ఆమీర్‌తో నాగ చైతన్య (Twitter/Photo)

Naga Chaitanya - Ameer Khan: ‘లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్‌లో ఆమీర్‌ ఖాన్‌తో జత కలిసిన  నాగ చైతన్య.. జవాన్ గెటప్‌లో చైతన్య కొత్త లుక్ అదుర్స్ అంటున్నారు నెటిజన్స్.

  Naga Chaitanya - Ameer Khan: ‘లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్‌లో ఆమీర్‌ ఖాన్‌తో జత కలిసిన  నాగ చైతన్య.. జవాన్ గెటప్‌లో చైతన్య కొత్త లుక్ అదుర్స్ అంటున్నారు నెటిజన్స్. గత కొన్నేళ్లుగా మన హీరోలు ప్యాన్ ఇండియా ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు. క్యారెక్టర్ నచ్చి అవకాశం దొరికితే వేరే భాషల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ జనరేషన్‌లో రానా దగ్గుబాటి క్యారెక్టర్ నచ్చితే పలు భాషల్లో యాక్ట్ చేస్తున్నారు. అటు సీనియర్ హీరో నాగార్జున కూడా హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ఇపుడు ’బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు. ఇపుడు తండ్రి నాగ్ బాటలోనే నాగ చైతన్య కూడా ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను డైరెక్ట్‌గా పలకరించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ లద్దాఖ్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో ఆమీర్ ఖాన్‌తో కలిసి నాగ చైతన్య షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.

  ఈ సందర్భంగా చిత్ర యూనిట్..  ఆమీర్ ఖాన్‌తో నాగ చైతన్య ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలో నాగ చైతన్య జవాన్‌గా కోర మీసాలతో ఎంతో క్యూట్ గా ఉన్నారు. రీసెంట్‌గా నాగ చైతన్య సతీమణి.. సమంత.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్ధా’ను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు.

  Naga Chaitanya Bollywood Debut | బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన నాగ చైతన్య.. వివరాల్లోకి వెళితే..
  ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌లో జాయిన్ అయిన నాగ చైతన్య (Instagram/Photo)

  ఇక ‘లాల్ సింగ్ చద్దా’  షూటింగ్‌లో నాగ చైతన్య ఎపుడో జాయిన్ కావాల్సింది. కానీ కోవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో నాగ చైతన్య జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్‌‌ను లద్దాఖ్‌లో నాగ చైతన్య పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో దక్షిణాదికి చెందిన ఓ యువకుడి పాత్ర ఉందట. కథను కీలక మలుపు తిప్పే అతికీలకమైన ఆ క్యారెక్టర్ ఇది. ఆమీర్ ఖాన్ నటిస్తోన్న ‘లాల్ సింగ్ చద్దా’ విషయానికొస్తే.. ఈ సినిమాను హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తంగా ‘లాల్‌సింగ్ చద్దా’లో చైతూ గెటప్ ను విడుదల చేసి టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేసారు.

  Naga Chaitanya - Ameer Khan: ‘లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్‌లో ఆమీర్‌ ఖాన్‌తో జత కలిసిన  నాగ చైతన్య.. జవాన్ గెటప్‌లో చైతన్య కొత్త లుక్ అదుర్స్ అంటున్నారు నెటిజన్స్.
  ’లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్‌లో ఆమీర్‌తో నాగ చైతన్య (Twitter/Photo)

  నాగ చైతన్య విషయానికొస్తే.. ఈయన హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ చిత్రం త్వరలో విడుదల కానుంది.  ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. తెలంగాణ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పాపులర్ అయ్యాయి.  మరోవైపు నాగ చైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశీఖన్నాతో అవికా గోర్, మాళవిక నాయర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొత్తంగా నాగ చైతన్య సినిమాల విషయంలో దూకుడు మీదే ఉన్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Aamir Khan, Bollywood news, Kareena Kapoor, Laal Singh Chaddha, Naga Chaitanya Akkineni, Tollywood

  ఉత్తమ కథలు