ఇటీవల మెగా డాటర్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ మధ్యకాలంలో నిహారిక పేరు మార్మోగిపోయింది.ఇటీవలే ఈ ఫుడ్ అండ్ మింక్ పబ్‌లో దాడులు చేశారు. అయితే ఆ పబ్‌లో నిహారిక ఉండటం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన దాడిలో నిహారికతో పాటుగా బిగ్‌బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం తీవ్ర చర్చకు దారి తీసింది.
వీరంతా సెలబ్రిటీ పిల్లలు కావడంతో వీరి పేర్లే ఎక్కువగా మారుమోగాయి.ఇకపోతే ఈ ఇన్సిడెంట్ తర్వాత కొన్నిరోజుల పాటు నిహారిక ఎక్కడా కనిపించలేదు.సోషల్ మీడియాలో కూడా కనిపించకుండా పోయింది. దీంతో కొన్నాళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తాజాగా మదర్స్ డే సందర్భంగా తల్లితో కలిసి ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు తల్లికూతుళ్లు అభిమానులతో పంచుకున్నారు.
నిహారికపై వార్తలు వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో కాస్త బాధగా అనిపించిందన్నారు నిహారిక తల్లి కొణిదెల పద్మజ. నిహారిక గురించి బయట వార్తలు వచ్చినప్పుడు మీకెలా అనిపించిందని అని అడిగిన ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. ‘ మాకున్నదాంట్లో ఎవరూ ఏం చేయలేరు. అలా అంటే ఇంట్లో తలుపులు వేసుకొని ఉండాలి. మనం తప్పు చేయనంతవరకు ఏం బాధ పడాల్సిన పనిలేదు. నిహారిక ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఏదైనా అన్నా నాకేం పెద్దగా అనిపించదు. మేం ఏంటో మాకు తెలుసు.. నా కూతురు ఏంటో నాకు తెలుసు.. బయటోళ్లు చూస్తారు ఏముంది. ఎప్పుడు ఎవరైనా బావున్నారంటే దాని మీద రాయి వేయాలనో.. మనకు కష్టపెట్టాలని చూస్తుంటారు.. నాకైతే అట్లా ఏం లేదు. నాకైతే మా బావగారు ఉన్నారు. మా బావగారు ఉన్నంతవరకు మాకేం పర్వా లేదు’ అన్నారు పద్మజ కొణిదెల.
నిహారిక భర్త చైతన్య కూడా.. చాలా అండర్ స్టాండింగ్ ని చెప్పారు పద్మజ. నిహారికను చైతన్య చాలా బాగా చూసుకుంటాడన్నారు. ఇక నిహారిక కూడా ఈ విషయంలో స్పందించింది. తాను అసలు న్యూస్ చూడనంది. యూట్యూబ్ థంబ్ మెయిల్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్స్ అస్సలు చూడనన్నారు. నాపైనే ఎన్ని అయినా రాసుకోండి.. జీరో..నాకు ఏ మాత్రం ఫరక్ పడదంది నిహారిక. ఎవడు కూడా తన ముఖంమీదకు వచ్చి చెప్పరు. ఒక వేళ చెప్పినా కూడా మనం కొట్టేస్తాం కదా.. అంటూ సరదాగా కామెంట్స్ చేసింది నిహారిక. వరుణ్ కూడా నిహారికకు ముందే చెప్పాడని .. అలాంటివేం చూడొద్దన్నారని తల్లి పద్మజ కూడా అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Mega brother nagababu, Naga Babu Konidela, Niharika konidela