బాలయ్య ఇష్యూ తర్వాత నాగబాబు మరో సంచలన ట్వీట్..

నాగబాబు (Twitter/Nagababu)

నాగబాబు.. కేవలం చిరంజీవి తమ్ముడుగానే కాకుండా పవన్ కళ్యాణ్ అన్నగా జనసేన పార్టీ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన మరో సంచలన ట్వీట్ చేసారు.

  • Share this:
    నాగబాబు.. కేవలం చిరంజీవి తమ్ముడుగానే కాకుండా పవన్ కళ్యాణ్ అన్నగా జనసేన పార్టీ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌గా బాలయ్య.. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంత మంది తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన చర్చలు తనకు తెలియవు అంటూ చెప్పి సంచలనం రేపాడు. అంతేకాదు భూములు పంచుకోవడానికే వీళ్లందరు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపారన్నట్టు బాలయ్య చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగాయి. ఈయన వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక నాగబాబు ఇష్యూపై స్పందించడానికి బాలయ్య నిరాకరించారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు మరో సంచలన ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి ఆయన ట్వీట్‌లో రౌడీలను, గూండాలను టార్గెట్ చేసారు. మన రాబోయే తరం ధైర్యంగా ఉండేందుకు మన పాఠ్యాంశాల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మన దేశానికి కావాల్సింది చల్లబడిన రక్తం ఉన్నవారు కాదని, మరిగే రక్తం కలిగేవారు.. దేశాన్ని ఎంతో ఇష్టంగా ప్రేమించే వీరులు కావాలని కాస్త ఎమోషనల్‌ అయ్యారు.
    ఇప్పటికే భారతీయుల రక్తం శాంతి, అహింస మంత్రాలతో పూర్తిగా చల్లబడిపోయిందన్నారు. తిరిగి మన యువత రక్తం వేడెక్కాలంటే ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ సింగ్, అశోక చక్రవర్తి, పృథ్వీరాజ్ చౌహాన్, శ్రీ కృష్ణదేవరాయలు వంటి మహా వీరుల కథలను పిల్లలతో చదివిస్తే.. రాబోయే తరం వారైనా.. సాహసం, పౌరుషం, మరిగే రక్తంతో పెరుగుతారన్నారు. రాబోయే తరం వాళ్లను దేశానికి ఉపయోగపడే వీరులుగా తయారు చేద్దాం అంటూ పిలుపునిచ్చారు. మన దేశాన్నిదోచుకునే వారు కాదు.. ప్రేమించే వీరులు కావాలన్నారు. నోటుకు ఓటు వేసే పౌరులు కాదు. దేశాన్ని పట్టి పీడిస్తున్న దేశ ద్రోహులు, గుండాలు, మాఫియా, కుహాన లౌకికవాదులు, ఫ్యాక్షన్ గుండాల నుంచి దేశాన్ని కాపాడే వీరులు ఇపుడు మనకు అవసరం అన్నారు. ప్రతి నేరాన్ని పోలీసులు, మిలిటరీ మాత్రమే డీల్ చేయాలంటే కుదరని పని అంటూ నాగబాబు కాస్తంత ఎక్కువగానే  ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా వస్తువులను, ఆప్స్‌ను బహిష్కరిద్దాం. మన దేశంలోనే తయారైన వస్తువులనే కొందాం. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ మనది. అన్ని దేశాలు తమ వస్తువులను ఇక్కడ అమ్మి లక్షల కోట్లు ఆర్జిస్తున్నారు. చైనా దేశపు వెన్నుముక విరగరాలంటే ముందుగా అందరం ఇక ముందు నుంచైనా చైనా వస్తువులను బహిష్కరించి ఆ దేశాన్ని ఆర్ధికంగా దెబ్బ తీయాలి. ఈ సందర్భంగా దేశ ప్రజలందరు ఇక్కడే తయారైన వస్తువులు కొనేలా ప్రోత్సహించాలన్నారు.    Published by:Kiran Kumar Thanjavur
    First published: