Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: June 10, 2020, 8:35 PM IST
నాగబాబు, బాలకృష్ణ (nagababu balakrishna)
బాలయ్యను ఓ పట్టాన వదిలేలా కనిపించడం లేదు నాగబాబు. ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. వీలు దొరక్కపోయినా కూడా దొరికించుకుని మరీ సెటైర్లు వేస్తున్నాడు. మొన్నటి వరకు ఓ రచ్చ.. ఇప్పుడు మరో రచ్చకు తెరలేపాడు ఈయన. నాగబాబు తీరు చూస్తుంటే ఇప్పట్లో ఈ గోల ఆగేలా కూడా కనిపించడం లేదు. తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య ఓ పాట పాడాడు. అప్పట్లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జగదేకవీరుని కథ సినిమాలో శివశంకరీ పాటను తన గాత్రంతో పాడాడు బాలయ్య. ఈ వయసులో ఈయన చేసిన సాహసాన్ని చూసి అభిమానులు పొంగిపోతున్నారు.
బాగుందా బాలేదా అనేది పక్కనబెడితే ఏ మాత్రం సిగ్గు పడకుండా బాలయ్య చేసిన ప్రయత్నాన్ని వాళ్లు మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇదే పాటపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు నాగబాబు నేరుగా ఈ పాటపై సెటైర్ వేసాడు. బాలయ్య పేరు పెట్టకుండా.. ఆయన పాడిన పాట ఊసెత్తకుండా కొన్ని పాటలు రీమిక్స్ కంటే ఒరిజినల్స్ బాగుంటాయంటూ బాంబ్ పేల్చాడు.
ఒక్కోసారి ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ కన్నా originals చాలా అద్భుతంగా ఉంటాయి.ఈ తరానికి ఘంటసాల గాత్ర మాధుర్యం విలువ ఈ పాటికె తెలిసుంటది.. అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. శివశంకరీ పాటను ఘంటసాల ఆలపించారు.. ఇప్పుడు అదే పాటను బాలయ్య కూడా పాడాడు. దాంతో నాగబాబు చేతికి పని చెప్పాడు. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. మరి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలిక.
Published by:
Praveen Kumar Vadla
First published:
June 10, 2020, 8:35 PM IST