నిహారికకు వార్నింగ్ ఇచ్చిన నాగబాబు.. ఇంటికి రా చెప్తా నీ సంగతి..

నిహారిక నాగబాబు (naga babu niharika)

Niharika Naga Babu: ఈ మధ్య కాలంలో నిహారిక పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దానికి కారణం ఆమె ఓ ఇంటిది కానుండటమే. కొణిదెల పేరు మార్చుకోవాల్సిన..

  • Share this:
ఈ మధ్య కాలంలో నిహారిక పేరు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దానికి కారణం ఆమె ఓ ఇంటిది కానుండటమే. కొణిదెల పేరు మార్చుకోవాల్సిన సమయం నిహారికకు వచ్చేసింది. త్వరలోనే ఈమె ఇంటి పేరు మారబోతుంది. ఇకపై నిహారిక జొన్నలగడ్డ కాబోతుంది కొణిదెల వారమ్మాయి. దాంతో అమ్మాయిలో పెళ్లి కళ వచ్చేసింది. దానికి తోడు సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు రచ్చ చేస్తూనే ఉంది నిహారిక. ఇదిలా ఉంటే తాజాగా నిహాకు నాగబాబు వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకో తెలిస్తే నవ్వుకుంటారు.
నిహారిక నాగబాబు (naga babu niharika)
నిహారిక నాగబాబు (naga babu niharika)

జీ తెలుగులో నిహారిక పెళ్లినే కాన్సెప్టుగా చేసుకుని బాపు బొమ్మకు పెళ్లంట అనే ఈవెంట్ ప్లాన్ చేసారు. అందులో చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. అనసూయ, నాగబాబు, జానీ మాస్టర్ సహా చాలా మంది అక్కడే ఉన్నారు. అందులో నిహారిక కూడా ఉంది. మెయిన్ కాన్సెప్ట్ అంతా నిహారిక పెళ్లి చుట్టూనే తిరిగింది. అందులో భాగంగానే ఆమె జీవితంలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ కొన్ని స్పెషల్ ఫోటోస్ స్క్రీన్‌పై చూపించాడు.
నిహారిక నాగబాబు (naga babu niharika)
నిహారిక నాగబాబు (naga babu niharika)

అవి మరేంటో కాదు.. నిహారిక కాలేజ్ ఫోటోలు. నిహా స్టేజ్‌పై ఉండగానే బ్యాగ్రౌండ్‌లో ఆమె కాలేజ్ ఫోటోలను చూపించాడు ప్రదీప్. అందులో చివర్లో కూర్చుని హెల్మెట్ పెట్టుకుని ఉంది నిహారిక. ఎందుకలా అంటే నిద్ర వస్తుంటే.. అలా కవర్ చేసానంటూ నవ్వేసింది ఈమె. అంతేకాదు.. నిహారికకు డిగ్రీ మూడో సంవత్సరంలో అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందని మీరు అనుకుంటున్నారంటూ నాగబాబును ప్రదీప్ ఓ సరదా ప్రశ్న వేస్తాడు. దానికి నాగబాబు ఆలోచిస్తుండగా.. 29 శాతం అంటూ నిహా సమాధానం చెప్తుంది.

దాంతో వెంటనే నాగబాబు.. అమ్మనీ ఇంటికి రా నీ సంగతి చెప్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దానికి వెంటనే నిహారిక కూడా నవ్వుతూ సమాధానమిచ్చింది. నాన్నా పెళ్లైపోతుంది.. ఇప్పుడు ఇవన్నీ వద్దు అంటూ సరదాగా నవ్వేసింది. దాంతో అక్కడున్న వాళ్లంతా కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఈ సరదా సీన్ అంతా బాపు బొమ్మకు పెళ్లంట ఈవెంట్‌లో హైలైట్ కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రోమోనే ఇంత రచ్చ చేస్తుంటే.. రేపు ఫుల్ ఎపిసోడ్ విడుదలయ్యాక యూ ట్యూబ్ షేక్ అయిపోతుందేమో..?
Published by:Praveen Kumar Vadla
First published: