Home /News /movies /

Naga Babu : మా అన్నయ్య పెదరాయుడిలా సింహాసనంపై కూర్చోవలనుకోలేదు.. నాగబాబు కామెంట్స్..

Naga Babu : మా అన్నయ్య పెదరాయుడిలా సింహాసనంపై కూర్చోవలనుకోలేదు.. నాగబాబు కామెంట్స్..

నాగబాబు (Naga Babu/Instagram)

నాగబాబు (Naga Babu/Instagram)

Naga Babu - MAA Elections  : మా అన్నయ్య చిరంజీవి ఎపుడు సినీ ఇండస్ట్రీలో  పెదరాయుడిలా సింహాసనంపై కూర్చోని పెత్తనం చేయాలనుకునే వ్యక్తి కాదంటూ మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

    Naga Babu - MAA Elections  : మా అన్నయ్య చిరంజీవి ఎపుడు సినీ ఇండస్ట్రీలో  పెదరాయుడిలా సింహాసనంపై కూర్చోని పెత్తనం చేయాలనుకునే వ్యక్తి కాదంటూ మెగా బ్రదర్ నాగబాబు కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచారంటూ నాగబాబు ఆరోపణలు చేసారు. అంతా ఒకే కుటుంబంగా ఉండాల్సిన చోట ప్రాంతీయ తత్వం చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.అంతేకాదు ఈ ఎన్నికల్లో చిరంజీవి మెగా కాంపౌండ్ మద్దతుతో పోటీ చేసిన ప్రకాష్ రాజ్.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పై గెలిచారు.

    ‘మా’ ఎన్నికల్లో  ముఖ్యంగా మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి యుద్ధం మరోసారి తెరపైకి వచ్చింది. దాన్ని కొందరు ధైర్యంగా తెర ముందు కూడా చెప్పారు. అక్కడ పోటీలో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఉన్నాడు.. మరొకవైపు ప్రకాష్ రాజ్ నిలబడ్డాడు. కానీ చివరకు మంచు విష్ణు ఎన్నికల్లో గెలవడంతో చిరంజీవిపై మోహన్ బాబు పై చేయి సాధించినట్టైయింది. అంతేకాదు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా స్వీకరించి పెన్షన్ ఫైల్ పై తొలి సంతకం చేశారు. 

    Chiranjeevi - Salman Khan: చిరంజీవి ‘గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ రోల్ పై క్లారిటీ..

    ఇక హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలిచారు. ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదంతోనే తనను అధ్యక్షుడిగా ఓడించారంటూ ప్రకాష్ రాజ్ తన ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కదా. అంతకు ముందు మెగా బ్రదర్ నాగబాబు కూడా కుళ్లు, కుతంత్రాలు నిండిన ‘మా’లో సభ్యుడిగా కొనసాగలేనంటూ రాజీనామా లేఖ సందించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ‘మా’ అసోషియేషన్‌లో ఇకపై సభ్యుడిగా కొనసాగాలనుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశారు.

    Manchu Vishnu : ‘మా’ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించిన మంచు విష్ణు.. ఆ ఫైలు పై తొలి సంతకం..

    అంతేకాదు జనరల్ ఎలక్షన్స్‌లో ఏ విధంగా అక్రమాలకు పాల్పాడుతారో.. ‘మా’ ఎన్నికల్లో అలాంటి అక్రమాలే జరిగినట్టు నాగబాబు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ‘మా’ ఎన్నికల్లో సభ్యుల సంక్షేమం, అసోసియేషన్ అభివృద్ధికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో పోటీ చేసేవారు చెప్పకుండా.. ప్రకాష్ రాజ్ పై నాన్ లోకల్ అంటూ ముద్ర వేయడంతో పాటు.. ఆయన పర్సనల్ విషయాలను కూడా ఇందులో లాగి ఆయన ఇమేజ్‌కు భంగకరంగా మాట్లాడటం తనకు కలిచివేసిందన్నారు. అంతేకాదు ప్రకాష్ రాజ్‌కు వ్యతిరేకంగా మంచు విష్ణు ప్యానల్ సభ్యులు చేసిన కామెంట్స్‌కు నేను పర్సనల్‌గా ఎన్నోసార్లు బదులు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా నాగబాబు ప్రస్తావించారు.

    HBD Pooja Hegde: హ్యాపీ బర్త్ డే పూజా హెగ్డే.. టాలీవుడ్ ప్రేక్షకుల ప్రేరణ

    ఇప్పటి వరకు ‘మా’ అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండటంతో పాటు ఒకసారి అధ్యక్షుడిగా వ్యవహరించినందకు తాను ఎంతో గర్వంగా ఫీలయ్యాను. అంతేకాదు ఇప్పటి వరకు తెలుగు సినీ రంగానికి చెందిన వారికి ప్రాంతీయ వాదం ఉండదనుకున్నాను. అందరు విశాల హృదయంతో వ్యవహరిస్తారనుకున్నాను. కానీ ఎన్నికలు జరిగిన తీరు చూసిన తర్వాత ఇకపై ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు నిండిన అసోషియేషన్‌లో ఉండి ప్రయోజనం లేదని తనకు అనిపించిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు నాగబాబు వెల్లడించారు.

    Mani Sharma : ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట్లో పెళ్లి సందడి.. త్వరలో ఓ ఇంటి వాడు కానున్న మహతి స్వర సాగర్..


    ఇకపై ‘మా’ అసోసియేషన్‌‌తో తనకు సంబంధం లేదన్నారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కులా పెదరాయుడిలా వ్యవహరించాలని మా అన్నయ్య చిరంజీవి ఎపుడు అనుకోలేదు. అంతేకాదు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు తమ కష్టాలను చెప్పుకోవడానికి తన దగ్గరకు వస్తే.. వారికి అక్కున చేర్చుకొని సాధ్యమైనంత సాయం చేసారు కానీ.. ఎవరికీ అపకారం చేయలేదన్నారు. అంతే తప్పు పెదరాయుడిలా సింహాసనంపై కూర్చని సినీ ఇండస్ట్రీలో పెద్దరికం చేస్తానని ఆయన ఎపుడు అనలేదు. ఆయనకు అంత అహంభావం లేదన్నారు. ఇక కుటుంబ సభ్యులు కలిసి కొత్త అసోషియేషన్ ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, MAA Elections, Manchu Vishnu, Mohan Babu, Nagababu, Prakash Raj, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు