పవన్ కళ్యాణ్, బాలయ్య ఫోటోను షేర్ చేసిన నాగబాబు..

నాగబాబు బాలయ్య (nagababu balakrishna)

Pawan Kalyan Balakrishna: నాగబాబు ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా బిహేవ్ చేస్తాడో ఎవరికీ అర్థం కాడు. ఈయన కూడా చిన్న సైజ్ వర్మ మాదిరి తయారవుతున్నాడు.

  • Share this:
నాగబాబు ఎప్పుడు ఎలా ఉంటాడో.. ఎలా బిహేవ్ చేస్తాడో ఎవరికీ అర్థం కాడు. ఈయన కూడా చిన్న సైజ్ వర్మ మాదిరి తయారవుతున్నాడు. ఊహకందని ట్విస్టులు ఇస్తూ ముందుకెళ్తున్నాడు మెగా బ్రదర్ నాగబాబు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడతాడో కూడా అర్థం కావడం లేదు. యూ ట్యూబ్‌లో తన భావాలను ప్రేక్షకులతో పంచుకుంటూనే.. మరోవైపు తన వ్యూ కూడా అందరికీ పంచుతున్నాడు. ముఖ్యంగా అప్పుడప్పుడూ ఈయన చేస్తున్న కామెంట్స్.. పోస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
బాలయ్య పవన్ కళ్యాణ్ (pawan kalyan balakrishna)
బాలయ్య పవన్ కళ్యాణ్ (pawan kalyan balakrishna)

ఇప్పుడు కూడా ఇదే చేసాడు నాగబాబు. తాజాగా ఈయన పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఫోటో పాతదే అయినా కూడా నాగబాబు షేర్ చేయడంతో మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. గత ఎన్నికల ముందు జనసేన తరఫున ఉంటూ.. తెలుగుదేశంతో పాటు బాలయ్యను కూడా భారీగానే టార్గెట్ చేసాడు. యిష్టమొచ్చినట్లు మాట్లాడాడు కూడా. ముఖ్యంగా తనకు బాలయ్య అంటే ఎవరో తెలియదని కూడా చెప్పాడు నాగబాబు. అయితే ఇప్పుడు అదే నాగబాబు ట్విస్ట్ ఇచ్చాడు.
నాగబాబు బాలకృష్ణ (naga babu balakrishna)
నాగబాబు బాలకృష్ణ (naga babu balakrishna)

బాలయ్య ఫోటోను ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉండటం విశేషం. అప్పట్లో సుస్వాగతం సినిమా ఓపెనింగ్‌లో బాలయ్య కూడా ఉన్నాడు. దానికి సంబంధించిన ఫోటోను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసాడు నాగబాబు. దాని కింద మరింత ఆసక్తికరమైన కామెంట్ పెట్టాడు. 'ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి, నా దగ్గర దాచానంతే..' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

దాంతో పాటే ఇక్కడ మరింత ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా పోస్ట్ చేసాడు నాగబాబు. బ్రదర్స్ టు గ్యాదర్.. ఒకరు సొంత బ్రదర్.. మరొకరు బ్రదర్ ఫ్రమ్ అదర్ మదర్ .. అని రాసుకొచ్చాడు. అలాగే పవర్ స్టార్ నందమూరి సింహాన్ని కలిసిన రోజుది అంటూ పోస్ట్ చేసాడు మెగా బ్రదర్. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: