బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకో.. నాగబాబు కౌంటర్..

నాగబాబు బాలకృష్ణ (naga babu balakrishna)

Balakrishna Vs Naga Babu: ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాస్పద ట్వీట్స్‌తో రచ్చ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ఫైర్ అయ్యాడు. ఈ సారి ఏకంగా బాలయ్యను టార్గెట్ చేసాడు ఈయన.

  • Share this:
ఈ మధ్య కాలంలో ఎక్కువగా వివాదాస్పద ట్వీట్స్‌తో రచ్చ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు మరోసారి ఫైర్ అయ్యాడు. ఈ సారి ఏకంగా బాలయ్యను టార్గెట్ చేసాడు ఈయన. ఇండస్ట్రీలో జరుగుతున్న మీటింగ్స్ తనకు తెలియవని.. హైదరాబాద్‌లో అంతా కూర్చుని భూములు కానీ పంచుకుంటున్నారా అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తననెవ్వరూ పిలవలేదని.. పిలవకపోతే తనకు ఎలా తెలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలయ్య. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై సి కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీ కోసం జరుగుతున్న చర్చలను భూములు పంచుకోవడం అనడం తప్పు అని చెప్పాడు కళ్యాణ్.
బాలయ్యకు నాగబాబు కౌంటర్ (naga babu balakrishna)
బాలయ్యకు నాగబాబు కౌంటర్ (naga babu balakrishna)

ఇక ఇప్పుడు నాగబాబు కూడా దీనికి కౌంటర్ ఇచ్చాడు. బాలకృష్ణ నోరు జారొద్దు.. అదుపులో పెట్టుకోవాలంటూ కౌంటర్ వేసాడు. సమావేషానికి ఎవర్ని పిలవాలో.. ఎవర్ని పిలవకూడదో కమిటీకి తెలుసు అంటూ రివర్స్ కౌంటర్ వేసాడు నాగబాబు. భూములు పంచుకుంటున్నారన్న వ్యాఖ్యలు బాధాకరం అన్నాడు నాగబాబు. దాంతో పాటు ఈ వ్యాఖ్యలను వెంటనే బాలయ్య వెనక్కి తీసుకోవాలని కోరాడు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం సరికాదని హితవు పలికాడు నాగబాబు. బాలయ్య మాట్లాడింది చాలా తప్పని చెప్పాడు ఈయన.

పరిశ్రమనే కాదు.. తెలంగాణ ప్రభుత్వాన్నీ అవమానించారంటూ ఫైర్ అయ్యాడు మెగా బ్రదర్. ప్రభుత్వం, పరిశ్రమకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసాడు నాగబాబు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోరాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎవరు చేశారో.. ఒకసారి ఏపీకి వెళ్తే తెలుస్తుంది.. వ్యాపారం చేసి ఏపీని ఎవరు సర్వనాశనం చేశారనేది అందరికీ తెలుసు అంటున్నాడు నాగబాబు. బాలకృష్ణ ఏం మాట్లాడినా నోరు మూసుకుని కూర్చోమని.. ఇండస్ట్రీకి ఆయనేం కింగ్ కాదు.. కేవలం హీరో మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. దాంతో ఇష్యూ కాస్తా ఇప్పుడు పెద్దదయ్యేలా కనిపిస్తుంది. గతంలో కూడా ఓ సారి బాలయ్య తనకు తెలియదంటూ చాలా పెద్ద వివాదం సృష్టించాడు నాగబాబు. మరిప్పుడు ఎంతదూరం వెళ్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: