వరుణ్ తేజ్ కోసం నాగబాబు మెగాప్లాన్.. వర్కౌట్ అయితే అదిరిపోవాల్సిందే..

వరుణ్ తేజ్ కోసం నాగబాబు మెగా ప్లాన్ రెడీ చేసి పెట్టాడు. అది వర్కౌట్ అయితే మాత్రం అదిరిపోవాల్సిందే అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 25, 2020, 6:31 AM IST
వరుణ్ తేజ్ కోసం నాగబాబు మెగాప్లాన్.. వర్కౌట్ అయితే అదిరిపోవాల్సిందే..
తనయుడు వరుణ్ తేజ్‌తో నాగబాబు (Twitter/Photo)
  • Share this:
వరుణ్ తేజ్ కోసం నాగబాబు మెగా ప్లాన్ రెడీ చేసి పెట్టాడు. అది వర్కౌట్ అయితే మాత్రం అదిరిపోవాల్సిందే అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో రీమేక్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ అంటే వేరే భాషల్లో హిట్టైన సినిమాలను రీమేక్ చేయడం కాదు.. తెలుగు హిట్టైన పాత సూపర్ హిట్ సినిమాలను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ఆలోచన పెరిగింది. తాజాగా వరుణ్ తేజ్ కూడా పాత సినిమాలను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తండ్రి మెగా బ్రదర్ నాగబాబు అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ  చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని మీ అబ్బాయి.. వరుణ్ తేజ్.. మీ అన్నయ్య చిరంజీవి యాక్ట్ చేసిన ఏ సినిమాలను రీమేక్ చేస్తే బాగుంటుంది అనే దానికి ఆసక్తికర సమాధానమిచ్చాడు. అన్నయ్య చిరు నటించిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలు వరుణ్ తేజ్ రీమేక్ చేస్తే చూడాలని ఉందని తన మనసులో మాట బయటపెట్డాడు. ఇక ఈ రెండు సినిమాల విషయానికొస్తే.. చిరు కెరీర్‌లో మంచి హిట్ సినిమాలుగా మిగిలాయి.

ఛాలెంజ్, కొదమ సింహం సినిమా రీమేక్‌లో వరుణ్‌ తేజ్ ? (File/Photos)


అందులో ఛాలెంజ్ సినిమా విషయానికొస్తే.. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కే.యస్.రామారావు నిర్మించారు. ఛాలెంజ్ విషయానికొస్తే.. మంచి తలుచుకుంటే ఏమైనా సాధించగలడనే దానికి ఈ సినిమా స్పూర్తిగా నిలించింది.  కొదమ సింహం విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని కే.మురళీ మోహన్ రావు డైరెక్ట్ చేసారు. ఈ రెండు సినిమాలు వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు నాగబాబు.

చిరంజీవి కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిన చాలెంజ్, కొదమ సింహం సినిమాలు (Facebook/Photos)


ఇక వరుణ్‌కు ఈ రెండు పాత్రలు బాగానే సెట్ అవుతాయన్నారు నాగబాబు. ఇక చిరంజీవి కెరీర్‌లో స్పెషల్ చిత్రాలుగా నిలిచిన ఈ రెండు వరుణ్ తేజ్ చేయడం పెద్ద సాహసమే అని కూడా చెప్పారు. ప్రస్తుతం వరుణ్ తేజ్.. ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 25, 2020, 6:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading