జబర్దస్త్‌లో నాగబాబు రీ ఎంట్రీ.. MLA రోజా కంటిన్యూ.. హైపర్ ఆది జోష్..
అవును.. చాలా రోజుల తర్వాత మళ్లీ జబర్దస్త్‌లో పాత జడ్జిలు కలిసి కనిపించారు. రాజకీయ వేడిలో రెండు నెలలుగా జబర్దస్త్ నుంచి దూరంగా ఉన్న నాగబాబు మళ్లీ తన సొంత గూటికి వచ్చేసాడు. ఈ సారి మరింత రీ ఫ్రెషింగ్‌గా కనిపించాడు మెగా బ్రదర్.

‘జబర్దస్త్’ షో నాగబాబు, రోజా
- News18 Telugu
- Last Updated: June 7, 2019, 10:06 AM IST
అవును.. చాలా రోజుల తర్వాత మళ్లీ జబర్దస్త్‌లో పాత జడ్జిలు కలిసి కనిపించారు. రాజకీయ వేడిలో రెండు నెలలుగా జబర్దస్త్ నుంచి దూరంగా ఉన్న నాగబాబు మళ్లీ తన సొంత గూటికి వచ్చేసాడు. ఈ సారి మరింత రీ ఫ్రెషింగ్‌గా కనిపించాడు మెగా బ్రదర్. ఎన్నికల్లో గెలిచినా ఓడినా తమ స్థానం మాత్రం అక్కడే అంటున్నారు వీళ్లు. ముఖ్యంగా నాగబాబుతో పాటు రోజా కూడా ఈ షోలో కొనసాగుతుంది. ఈమె ఎమ్మెల్యేగా గెలిచింది.. రేపో మాపో మంత్రి కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయినా కూడా జబర్దస్త్ కామెడీ షోను మాత్రం వదలడం లేదు.

ఇక ఇప్పుడు నాగబాబు కూడా రీ ఎంట్రీ ఇచ్చేసరికి షో మరోసారి ఫుల్ అయిపోయింది. మూడు వారాలుగా అలీ వస్తుండటంతో నాగబాబుకు పూర్తిగా చెక్ పడిపోయినట్లే అని అనుకుంటున్న అభిమానులకు ఇప్పుడు మళ్లీ కళ వచ్చింది. ఇద్దరు పాత జడ్జిలను చూడటంతో షో రేటింగ్ మళ్లీ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వారం విడుదలైన ప్రోమోలో నాగబాబు వచ్చేసాడు. దాంతో హైపర్ ఆది కూడా ఈ ఇద్దరి రీ ఎంట్రీపైనే స్కిట్ చేసాడు.
ఎన్నికల్లో గెలిచినా ఓడినా వీళ్లిద్దరూ ఇక్కడుంటేనే అసలు కళ.. మనం ఉన్నా లేకపోయినా పొడిచేదేం లేదు.. వాళ్లుంటేనే జబర్దస్త్ షోకు కళ అంటూ ఆది వరస పంచ్ డైలాగులతో రచ్చ చేసాడు. ఇకపై నాగబాబు మళ్లీ జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదని తెలుస్తుంది. ఎలాగూ రాజకీయాల్లో కూడా ఇప్పుడు స్తబ్ధత ఉండటంతో ఈయన కూడా టీవీ రంగంపైనే ఫోకస్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఓ వైపు తమ్ముడు జనసేన పార్టీని చూసుకుంటూనే మరోవైపు సినిమాల్లో కూడా బిజీ కావాలని చూస్తున్నాడు ఈ మెగా బ్రదర్. ఎంపీగా గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది కానీ ఓడిపోవడంతో మరో ఆప్షన్ కూడా లేకుండా పోయింది ఈయనకు. మొత్తానికి చూడాలిక.. నాగబాబు రీ ఎంట్రీతో పడిపోతున్న జబర్దస్త్ రేటింగ్ మళ్లీ పైకి లేస్తుందో లేదో..?

నాగబాబు రోజా
ఇక ఇప్పుడు నాగబాబు కూడా రీ ఎంట్రీ ఇచ్చేసరికి షో మరోసారి ఫుల్ అయిపోయింది. మూడు వారాలుగా అలీ వస్తుండటంతో నాగబాబుకు పూర్తిగా చెక్ పడిపోయినట్లే అని అనుకుంటున్న అభిమానులకు ఇప్పుడు మళ్లీ కళ వచ్చింది. ఇద్దరు పాత జడ్జిలను చూడటంతో షో రేటింగ్ మళ్లీ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ వారం విడుదలైన ప్రోమోలో నాగబాబు వచ్చేసాడు. దాంతో హైపర్ ఆది కూడా ఈ ఇద్దరి రీ ఎంట్రీపైనే స్కిట్ చేసాడు.

హైపర్ ఆది నాగబాబు ప్రచారం
ఎన్నికల్లో గెలిచినా ఓడినా వీళ్లిద్దరూ ఇక్కడుంటేనే అసలు కళ.. మనం ఉన్నా లేకపోయినా పొడిచేదేం లేదు.. వాళ్లుంటేనే జబర్దస్త్ షోకు కళ అంటూ ఆది వరస పంచ్ డైలాగులతో రచ్చ చేసాడు. ఇకపై నాగబాబు మళ్లీ జబర్దస్త్ షో నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదని తెలుస్తుంది. ఎలాగూ రాజకీయాల్లో కూడా ఇప్పుడు స్తబ్ధత ఉండటంతో ఈయన కూడా టీవీ రంగంపైనే ఫోకస్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

నాగబాబు రోజా
హైపర్ ఆదికి ప్రమోషన్.. నాగబాబు జబర్దస్త్ వదిలేసాక కలిసొచ్చిన కాలం..
హైపర్ ఆది కాదు దేశముదురు...రోజా చూస్తుండగానే...ఆ యాంకర్‌తో రెచ్చిపోయి మజా
హైపర్ ఆదికి ఫ్రస్ట్రేషన్...ఢీలో సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్ ధాటికి తట్టుకోలేక...
ఇప్పటికైనా హైపర్ ఆది ఆశలు ఫలించేనా.. చావో రేవో అంటున్న జబర్ధస్త్ కమెడియన్..
శ్రీముఖిపై హైపర్ ఆది అదిరిపోయే పంచ్‌లు... బిగ్‌బాస్‌లో ఉండి మైండ్ పోయిందంటూ..
నాగబాబుకు భారీ షాక్.. హ్యాండిచ్చిన జబర్దస్త్ కమెడియన్లు..