Home /News /movies /

NAGA BABU MEGA BROTHER EMOTIONAL TWEET VIRAL ON SOCIAL MEDIA TA

Naga Babu : మెగా బ్రదర్ నాగ బాబు ఎమోషనల్ పోస్ట్.. వైరల్ అవుతున్న ట్వీట్..

నాగ బాబు (Twitter/Photo)

నాగ బాబు (Twitter/Photo)

Naga Babu : మెగా బ్రదర్ నాగ బాబు ఎమోషనల్ పోస్ట్.. వైరల్ అవుతున్న ట్వీట్ వివరాల్లోకి వెళితే.

    Naga Babu : మెగా బ్రదర్ నాగ బాబు ఎమోషనల్ పోస్ట్.. వైరల్ అవుతున్న ట్వీట్ వివరాల్లోకి వెళితే.. నాగేంద్ర బాబు ఉరఫ్ నాగబాబు చిరంజీవి తమ్ముడిగానే కాకుండా.. నిర్మాతగా, నటుడిగా, టీవీ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు అన్నయ్య చిరంజీవి సహకారంతో నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను కూడా నిర్మించాడు. అన్నయ్య చిరంజీవితో ఐదు చిత్రాలను నిర్మిస్తే.. ఒకే ఒక్క ‘బావగారూ.. బాగున్నారా’ సినిమా మాత్రమే హిట్టు అనిపించుకుంది. అటు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో నిర్మించిన ‘గుడుంబా శంకర్’.. రామ్  చరణ్‌తో నిర్మించిన ‘ఆరెంజ్’ సినిమా కూడా నిర్మాతగా నాగబాబుకు సక్సెస్ అందించలేకపోయాయి. మొత్తంగా తన ఇంట్లో ఇండస్ట్రీని శాసించే హీరోలున్న వాళ్లతో హిట్ చిత్రాలను నిర్మించలేకపోవడం నిజంగానే నాగబాబు దురదృష్టమనే చెప్పాలి.

    ఒకానొక సమయంలో రామ్ చరణ్‌తో నిర్మించిన ‘ఆరెంజ్’ సినిమా కారణంగా నాగబాబు అప్పులపాలయ్యాడు. ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకునట్టు ఓ సందర్భంలో నాగబాబు చెప్పిన  సంగతి తెలిసిందే కదా. ఆ సమయంలో నాగబాబును ఆదుకోవడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆర్ధికంగా సాయం చేసాడనే వార్తలు కూడా వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే... నాగబాబు జబర్ధస్త్ కామెడీ షోతో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అంజనా ప్రొడక్షన్  బ్యానర్‌లో తన తనయుడు వరుణ్ తేజ్ హీరోగా సినిమా నిర్మిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు.


    అటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ తరుపున నర్సాపురం ఎంపీ స్థానాకికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మ్యాటర్ వైరల్ అవుతోంది.ఇన్నాళ్ల నా జీవితంలో .. ఎన్నో ఒడిదుడుకులను చూసి ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ ఆపదలు కష్టాలే నన్ను ఓ పూర్తి మనిషిగా తీర్చిదిద్దాయన్నారు. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజకుల సహాయ పడాలని నిర్ణయించుకొని అదే గమ్యంగా నా ప్రయాణం చేయాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. రేపు (మార్చి 14) న జనసేన ఆవిర్భావ దినోత్సవం.

    Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సహా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..


    ఈ సోమవారంతో  ఈ పార్టీ పెట్టి  8 యేళ్లు పూర్తైవుతోంది. ఈ సందర్భంగా ఇక సినిమాలకు, ప్రోగ్రామ్స్‌కు విరామం ఇచ్చిన ఇక పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఈ ట్వీట్‌తో తెలుస్తోంది.  ఇక ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతోంది అంటూ ఎండ్ చేశారు. మొత్తంగా సినిమాల నుంచి పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలు, ప్రజా సేవకే కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏమైనా దీనిపై మెగా బ్రదర్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Janasena, Naga Babu Konidela, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు