NAGA BABU JABARDASTH COUNTER ON AP MINISTER NARA LOKESH IN NARASAPURAM ELECTION CAMPAIGN PK
లోకేష్‌పై నాగబాబు జబర్దస్త్ కౌంటర్.. రాజకీయాల్లో రేలంగి అంటూ సెటైర్..
నాగబాబు నారా లోకేష్
నాగబాబు ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన తన నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నాడు. ఈయన జనసేన పార్టీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నాడు మెగా బ్రదర్.
నాగబాబు ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన తన నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్నాడు. ఈయన జనసేన పార్టీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేస్తున్నాడు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి దిగుతున్నాడు మెగా బ్రదర్. కచ్చితంగా తమ్ముడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానంటున్నాడు నాగబాబు. ఇక రాజకీయ ప్రచారంలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేష్‌పై మాటల దాడి చేసాడు. ముఖ్యంగా ఆయనపై సెటైర్ల వర్షం కురిపించాడు మెగా బ్రదర్. దానికి తోడు తాను పని చేస్తున్న జబర్దస్త్ కామెడీ షోను కూడా తన ప్రచారంలో వాడుకుంటున్నాడు నాగబాబు.
పవన్ సమక్షంటో జనసేనలో చేరిన నాగబాబు
మా జబర్దస్త్ కామెడీ కూడా లోకేష్ చేస్తున్న కామెడీ ముందు అస్సలు పనికిరాదని ఓ రేంజ్లో సెటైర్ల తూటాలు పేల్చాడు మెగా బ్రదర్. ఈయన మాటలు చూసి అక్కడున్న వాళ్లు కూడా నవ్వుకున్నారు. అసలు లోకేష్ బాబు కామెడీ చేస్తుంటే కడుపులు చెక్కలైపోతున్నాయని ఎద్దేవా చేసాడు నాగబాబు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాగబాబు ఈ సెటైర్లు వేసాడు.
నాగబాబు కామెంట్స్
ఇక రాజకీయ అవినీతి పరులను నడిరోడ్డులో ఉరి తీయాలంటూ ఆయన డిమాండ్ చేసాడు. లోకేష్ ఒక్కడ్నే కాకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా ఆయన టార్గెట్ చేసాడు. బాబు మానసిక స్థితి బాగోలేదని ఆరోపించాడు ఈయన. చంద్రబాబు పరిస్థితి బాగోలేదంటే.. ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ రాజకీయాల్లోకి వచ్చి సినిమాల్లో కమెడియన్ రేలంగిలా మారిపోయాడని ఎగతాళి చేసాడు నాగబాబు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.