Home /News /movies /

NAGA BABU INTERESTING COMMENTS ON JABARDASTH COMEDIAN HYPER AADI PUNCHES PK

Hyper Aadi - Naga Babu: హైపర్ ఆది పరువు తీసిన నాగబాబు.. పుసుక్కున అంత మాట అనేసాడేంటి..?

నాగబాబు, హైపర్ ఆది (hyper aadi naga babu/twitter)

నాగబాబు, హైపర్ ఆది (hyper aadi naga babu/twitter)

Hyper Aadi - Naga Babu: రైటర్‌గా సత్తా చూపించడమే కాకుండా నటుడిగానూ జబర్దస్త్ కామెడీ షోలో స్థిరమైన ముద్ర వేసాడు హైపర్ ఆది(Hyper Aadi). ఈయన కామెడీ అంటే చాలా మందికి యిష్టం. అలాగే మనోడి స్కిట్స్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ కూడా. ఇలాంటి ఆదిపై ఇప్పుడు సెటైర్లు వేసాడు నాగబాబు(Naga Babu).

ఇంకా చదవండి ...
తెలుగు బుల్లితెరపై హైప‌ర్ ఆదికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామెడీ పంచులు వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. కొన్నేళ్లుగా తనదైన పంచులతో కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తున్నాడు హైపర్ ఆది. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. రైటర్‌గా సత్తా చూపించడమే కాకుండా నటుడిగానూ జబర్దస్త్ కామెడీ షోలో స్థిరమైన ముద్ర వేసాడు ఈయన. ఆది కామెడీ అంటే చాలా మందికి యిష్టం. అలాగే మనోడి స్కిట్స్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్ కూడా. నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఉన్న‌ప్పుడు హైపర్ ఆదిని కూడా బాగా ఎంకరేజ్ చేసాడు. హైపర్ పంచులకు పగలబడి నవ్వేవాడు కూడా. అయితే ఆయన ఉన్నట్లుండి షో నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత అప్పటి వరకు మీరు సూపర్ అన్న వాళ్లే.. సెటైర్లు వేయడం మొదలు పెట్టారు. అందులో హైపర్ ఆది కూడా ఉన్నాడు. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత అదిరింది షోపై తనదైన పంచులతో పిచ్చెక్కించాడు ఆది. అయితే నాగబాబు తనతో పాటు హైపర్ ఆదిని కూడా తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నించాడు. సుడిగాలి సుధీర్ టీం కూడా రమ్మని పిలిచినా ఆయనతో వెళ్లలేదు.

అలాంటి సమయంలో ఆది కూడా నో చెప్పాడు. హైపర్ ఆది, సుధీర్ వెళ్లకపోవడానికి మ‌ల్లెమాల ప్రొడ‌క్ష‌న్స్‌తో చేసుకున్న అగ్రిమెంట్లు కారణం అంటూ ప్రచారం జరిగింది. అయితే నాగబాబు వెళ్లిపోయిన తర్వాత అదిరింది షోను నేపథ్యంగా చేసుకుని పంచులు వేసాడు ఆది. అక్కడ కూడా ఆదిపై అదిరిందిలో సద్దాం టీం పంచులు వేసారు. వాళ్లను కూడా నాగబాబు ఎంకరేజ్ చేసాడు. ఈ సమయంలో సోషల్ మీడియాలో హైపర్ ఆదిపై నాగ‌బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
naga babu,naga babu facebook,naga babu twitter,jabardasth comedian hyper aadi,jabardasth comedian hyper aadi skits,jabardasth comedian hyper aadi naga babu,naga babu comments on jabardasth comedian hyper aadi,నాగబాబు,నాగబాబు హైపర్ ఆది,హైపర్ ఆదిపై కామెంట్ చేసిన నాగబాబు
నాగబాబు, హైపర్ ఆది (hyper aadi naga babu/twitter)

అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించాడు నాగబాబు. అందులోనే చాలా విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. అదే సమయంలో హైపర్ ఆది గురించి చెప్పమని ఓ ఫాలోయర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగబాబు అతడి గాలి తీసేసాడు. ‘అత‌ను ఓకే కానీ.. కామెడీలో అప్‌డేట్ కావాల్సి ఉంది’ అని చెప్పేశాడు నాగబాబు. అంటే నటుడిగా హైపర్ ఆది ఓకే కానీ కామెడీ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పాడు. రొటీన్ పంచులతో కాలం గడిపేస్తున్నాడని.. అప్ డేట్ కాకపోతే అసలుకే మోసం వస్తుందనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాడు నాగబాబు. ఏదేమైనా సింగిల్ కామెంట్‌తో హైపర్ ఆది పరువు తీసేసాడు నాగబాబు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hyper Aadi, Nagababu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు