Mediclaim Policy: మెడికల్ ఇన్సూరెన్స్ అందరికీ అవసరమే అంటున్న నాగబాబు..

Nagababu: ఈ కరోనా కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే అంతే సంగతులు. ఎందుకంటే ఇప్పుడు ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి వ్యాధి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 10, 2020, 10:05 PM IST
Mediclaim Policy: మెడికల్ ఇన్సూరెన్స్ అందరికీ అవసరమే అంటున్న నాగబాబు..
నాగబాబు (Twitter/Nagababu)
  • Share this:
ఈ కరోనా కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే అంతే సంగతులు. ఎందుకంటే ఇప్పుడు ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి వ్యాధి వస్తుందో కూడా తెలియడం లేదు. మరోవైపు కార్పోరేట్ హాస్పిటల్స్ కూడా లక్షల్లో తప్ప తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో కచ్చితంగా హెల్త్ పాలసీలు పక్కాగా హెల్ప్ చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు నాగబాబు కూడా చెప్పాడు. ఎప్పుడూ తన యూ ట్యూబ్ ఛానెల్‌లో కాస్త కాంట్రవర్సీ వీడియోలు పోస్ట్ చేసే నాగబాబు.. ఇప్పుడు మాత్రం చాలా ఉపయోగపడే వీడియోను పోస్ట్ చేసాడు.
నాగబాబు (Twitter/nagababu)
నాగబాబు (Twitter/nagababu)


ఈయన పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్న సాయం గురించి ఆయన పూస గుచ్చినట్లు చెప్పాడు. మన స్థోమతకు తగ్గట్లు ఉండే పాలసీలు కూడా చాలానే ఉంటాయని.. వాటిని తప్పకుండా కట్టాలి అంటున్నాడు ఈయన. లేదంటే మాత్రం అనవసరంగా లక్షలకు లక్షలు కట్టాల్సి వస్తుందని.. మన ప్రాణాల మీదకు వచ్చినపుడు హెల్త్ ఇన్సూరెన్స్ విలువ తెలుస్తుందని చెప్తున్నాడు ఈయన.
నాగబాబు (Twitter/nagababu)
నాగబాబు (Twitter/nagababu)

ముఖ్యంగా పాలసీ కట్టడం అంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు కాదని.. మన భద్రత కోసం కట్టాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్తున్నాడు నాగబాబు. మనపై ఆధారపడిన వాళ్లకు కూడా ఇలాంటి పాలసీలు చేయించడం మంచిది అంటున్నాడు ఈయన. మనమేదో అనవసరంగా ఇప్పుడు కడుతున్నాం అనుకోవద్దని.. ఇక్కడ పాలసీ అంటే అందరి డబ్బులు కలిసి అవసరం ఉన్నవాడి కోసం ఖర్చు చేస్తుంటారని.. అలాంటిది మీ ఆరోగ్యం మీదకు వచ్చినపుడు కూడా చాలా వరకు అది హెల్ప్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటున్నాడు మెగా బ్రదర్.

కచ్చితంగా అంతా ఈ పాలసీ తీసుకుంటే వచ్చే నష్టం ఏం ఉండదని.. ఆ సమయానికి డబ్బులకు కాస్త కష్టమైనా కూడా కచ్చితంగా అవసరం వచ్చినపుడు మాత్రం చాలా హెల్ప్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటున్నాడు నాగబాబు. ఆరోగ్య భద్రత గురించి ఈయన చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 10, 2020, 10:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading